IND VS SL: టీమిండియా వర్సెస్ శ్రీలంక (Team India vs. Sri Lanka) మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్ ( India tour of Sri Lanka 2026) నిన్నటితో ముగిసింది. ఈ టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా రాణించి విజయం సాధించింది. అయితే రెండో టెస్ట్ మాత్రం చేతిలోకి వచ్చిన మ్యాచ్ ను డ్రా చేసుకుంది. ఐదవ రోజు శ్రీలంక బ్యాటర్లు అద్భుతంగా రాణించిన నేపథ్యంలో మ్యాచ్ డ్రా దిశగా వెళ్ళింది. అయినప్పటికీ 1-0 తేడాతో శ్రీలంకపై రెండు టెస్టుల సిరీస్ ను కైవసం చేసుకుంది టీం ఇండియా. అయితే డ్రా చేసుకోవడం వల్ల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు ( World Test Championship Final) వెళ్లే అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది టీం ఇండియా.
శ్రీలంక వర్సెస్ టీమిండియా (Team India vs. Sri Lanka) మధ్య ఆగస్టు 23వ తేదీన రెండవ టెస్టు ప్రారంభమైంది. అయితే ఇందులో టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 503 పరుగులు చేసింది. ఆ తర్వాత శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 290 పరుగులు చేయగా… ఫాలో ఆన్ ఆడాలని గిల్ ఆదేశించాడు. ఈ క్రమంలో గత మూడు రోజులుగా శ్రీలంకనే బ్యాటింగ్ చేసింది. ఐదవ రోజు ముగిసే సమయానికి 9 వికెట్లు నష్టపోయిన శ్రీలంక 429 పరుగులు సాధించింది.
అంటే ఈ టెస్ట్ లో టీమిండియా క్రికెటర్లు మొత్తం 3 రోజుల పాటు ఫీల్డింగే చేశారు. ఈ క్రమంలో శ్రీలంకలో ఉన్న ఉష్ణోగ్రతలకు టీమిండియా ప్లేయర్ల జెర్సీల అచ్చులు వీపులపైన పడ్డాయి. ముఖ్యంగా దేవదత్ పడిక్కల్ వేసుకున్న జెర్సీ వీపుకు అతుక్కుపోయింది. ఈ క్రమంలో జెర్సీ పైన ఉన్న నెంబర్ అచ్చులు అతడి వీపుపై పడ్డాయి. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
రెండు టెస్టు డ్రా కావడం వెనుక కారణాలను మాజీ క్రికెటర్లు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంకను ఫాలో ఆన్ ఆడించి కెప్టెన్ గిల్ అలాగే కోచ్ గంభీర్ తప్పు చేశారని మాజీలు ఆగ్రహిస్తున్నారు. ఇర్ఫాన్ పఠాన్, సంజయ్ మంజ్రేకర్ లాంటి సీనియర్ క్రికెటర్లు ఈ అంశంపై ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. శ్రీలంకను ఫాలో ఆన్ ఆడించకుండా… టీమిండియా సెకండ్ బ్యాటింగ్ చేసి ఉంటే కచ్చితంగా మ్యాచ్ గెలిచే వాళ్ళని తెలిపారు. దాదాపు మూడున్నర రోజులు టీమిండియా బౌలర్లు బౌలింగ్ చేసిన క్రమంలో అలసిపోయారని పేర్కొంటున్నారు. దీని వల్ల వికెట్లు తీయలేకపోయారని స్పష్టం చేస్తున్నారు. అటు మూడున్నర రోజుల పాటు టీమిండియా ప్లేయర్లు ఫీల్డింగ్ చేసి నీరసించిపోయారని.. దానికి నిదర్శనమే జెర్సీలో అచ్చులు అంటూ స్పష్టం చేస్తున్నారు.