BigTV English

Anam Mirza: ఏంటీ.. సానియా మీర్జా చెల్లెలు ఇంత ఆస్తి సంపాదించిందా..?

Anam Mirza: ఏంటీ.. సానియా మీర్జా చెల్లెలు ఇంత ఆస్తి సంపాదించిందా..?

 


Anam Mirza Success Story

Anam Mirza Success Story: భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా గురించి అందరికి తెలుసు. కానీ ఆమె చెల్లెలు “అనమ్ మీర్జా” గురించి అందరికి తెలియకపోవచ్చు. కాని ఈమె 330 కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధినేత !.. అనమ్ మీర్జా గురించి కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..


“అనమ్ మీర్జా” మాస్ కమ్యూనికేషన్ అండ్ మీడియా స్టడీస్ పూర్తి చేసి వివిధ జాతీయ ఛానెల్ లలో ఇంటర్న్ గా జర్నలిజంలో తన వృత్తిని ప్రారంభించి.. వ్యాపార రంగంలో ముందుకు సాగుతోంది. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఈమెకు సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఆకాంక్ష ఎక్కువగా ఉండేది. ఈ కారణంగానే 2013 లో ఔత్సాహిక జర్నలిస్టుల కోసం “ఇంక్ టు ఛేంజ్” అనే వెబ్ సైట్ ప్రారంభించింది. 2014 లో అక్బర్ రషీద్ తో వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె “ది లేబుల్ బజార్” అనే ఫ్యాషన్ లేబుల్ ని ప్రారంభించింది. 2022లో అనమ్ మీర్జా భారతదేశపు అతి పెద్ద రంజాన్ ఎక్స్ పో, దావత్-ఎ-రంజాన్ ను స్థాపించింది.

అనమ్ మీర్జా తన భర్త అక్బర్ రషీద్ తో విడిపోయిన తర్వాత భారత మాజీ కెప్టెన్ & రాజకీయ నాయకుడు అజారుద్దీన్ కుమారుడు మహమ్మద్ అసదుద్దీన్ ను వివాహం చేసుకుంది. వీరికి “దువా” అనే పాప కూడా ఉంది. అనమ్ మీర్జా తన పాప పేరు మీద 2023లో మరో ఫ్యాషన్ లేబుల్ ను ప్రారంభించింది. మహమ్మద్ అసదుద్దీన్ తండ్రి బాటలో నడిచి బ్యాటర్ గా మారిన క్రికెట్ కెరీర్ మాత్రం ముందుకు సాగలేదు. దీంతో క్రికెట్ ను విడిచి పెట్టాడు. అసదుద్దీన్ క్రికెటర్ కాక ముందే న్యాయవాది కూడా.

వ్యాపార రంగంలో తనదైన రీతిలో దూసుకెళ్తున్న “అనమ్ మీర్జా” వ్యాపారాల నికర విలువ 40 మిలియన్ల డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. దీంతో పాటు వ్యాపారాలు మాత్రమే కాకుండా 1,25,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ తో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అంటే భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం ఆమె ఆస్తి విలువ రూ.331 కోట్ల కంటే ఎక్కువ.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×