BigTV English

Mann ki Baat: ఎన్నికల కోడ్‌.. మన్‌ కీ బాత్‌కు 3 నెలల బ్రేక్..

Mann ki Baat: ఎన్నికల కోడ్‌.. మన్‌ కీ బాత్‌కు 3 నెలల బ్రేక్..

Mann ki Baat


Mann ki Baat: ప్రధాని ప్రతిష్టాత్మక కార్యక్రమం మన్ కీ బాత్. ప్రతి నెలా చివరి ఆదివారం వివిధ అంశాలపై మోదీ ప్రసంగిస్తున్నారు. ఈ ప్రోగామ్ కు ఎంతో ఆదరణ ఉంది. ఇప్పుడు ఎన్నికల సమయం ఆసన్నమైంది. మార్చిలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 3 నెలలు మన్ కీ బాత్ కార్యక్రమం ఉండదు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు.

తాజాగా మన్ కీ బాత్ 110వ ఎపిసోడ్ నిర్వహించారు. ఈ ప్రసంగంలో మోదీ లోక్ సభ ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున మన్ కీ బాత్ ను నిలిపివేస్తున్నామని తెలిపారు.


ఇప్పటి వరకు మన్ కీ బాత్ 110 ఎపిసోడ్‌లు మోదీ నిర్వహించారు. ప్రభుత్వంతో ఎలాంటి ప్రమేయం లేకుండా ఈ ప్రోగామ్ నిర్వహించామని ప్రధాని తెలిపారు. దేశ సామూహిక శక్తి, విజయానికి ఈ కార్యక్రమం అంకితమన్నారు.

Read More: దేశంలో పొడవైన కేబుల్ బ్రిడ్జ్.. సుదర్శన్ సేతును ప్రారంభించిన మోదీ..

మన్ కీ బాత్ దేశ ప్రజల ప్రోగామ్ అని మోదీ చెప్పుకొచ్చారు. ప్రజల కోసం ప్రజలచేత రూపుదిద్దుకుందని వివరించారు. మన్ కీ బాత్ 111వ ఎపిసోడ్‌ అంశాన్ని ప్రస్తావించారు. ఆ ఎపిసోడ్ కు ఎంతో ప్రత్యేకత ఉంటుందని పేర్కొన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ మన్‌ కీ బాత్‌ ప్రోగామ్ కు బ్రేక్ ఇచ్చారు.

 

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×