Business Idea: మీరు తక్కువ పెట్టుబడితో మంచి సీజనల్ వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా. అందుకోసం వేసవి కాలంలో నిర్వహించుకునే మంచి వ్యాపారం ఉంది. అదే జ్యూస్ బిజినెస్. ఈ వ్యాపారానికి పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ. అయితే ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, ఎలాంటివి అవసరం అవుతాయనే ఇతర విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
సమ్మర్ జ్యూస్ బిజినెస్‌ను ప్రారంభించడానికి ముందు మీరు ఈ వ్యాపారాన్ని ఏ ప్రాంతంలో పెట్టాలనేది నిర్ణయించుకోవాలి. స్టూడెంట్స్ లేదా జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటే మీకు వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు ఆ ప్రాంతాల్లో ఇతర జ్యూస్ కేంద్రాలు ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. మీకు పోటీగా ఇప్పటికే ఆ ప్రాంతంలో ఏదైనా ఏర్పాటు చేసుకుని ఉంటే, మీకు పోటీ పెరిగి వ్యాపారం తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆయా కేంద్రాలను ముందే పరిశీలన చేసుకుని, పోటీ లేదని తెలుసుకున్న తర్వాత మాత్రమే ఏర్పాటుకు సిద్ధం కావాలి.
Read Also: CIBIL Score: సిబిల్ స్కోర్ ఎలా లెక్కిస్తారో తెలుసా.. ఈ నాలుగు అంశాలే చాలా ప్రధానం
వేసవి కాలంలో బయటకు వచ్చిన అనేక మంది కూడా అధిక ఉష్ణోగ్రతల ధాటికి తట్టుకోలేక జ్యూస్‌లను తాగేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. దీంతో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మీరు ఈ వ్యాపారాన్ని ఎంచుకుంటే ఎలాంటి రిస్క్ ఉండదని చెప్పవచ్చు. ఇక పెట్టుబడి విషయానికి వస్తే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు కేవలం 10 వేల రూపాయల ఖర్చు మాత్రమే అవసరం అవుతుంది. జ్యూస్ తయారీ కోసం మిక్సి, చిన్న ఫ్రిడ్జ్ కోసం రూ.8 వేల్లోపు ఖర్చు చేసుకోవచ్చు. దీంతోపాటు కావాల్సిన ప్లాస్టిక్ గ్లాసెస్, బాటిల్స్, కవర్స్ కోసం రూ. 2000 సరిపోతాయని చెప్పవచ్చు. ఇలా ఈ వ్యాపారాన్ని మీరు రూ. 10 వేలలోపు పెట్టుబడితో ఈ వ్యాపారం ప్రారంభించుకోవచ్చు.
ప్రస్తుతం మార్కెట్లో జ్యూస్ ధరలు ఒక్కో గ్లాసుకు రూ. 20 నుంచి రూ. 30 వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరు రోజుకు 200 గ్లాసుల జ్యూస్ సేల్ చేస్తే మీకు గ్లాసుకు రూ. 10 చొప్పున మిగిలినా కూడా రోజుకు రెండు వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఈ విధంగా చూస్తే మీరు నెలకు రూ. 60 వేలకుపైగా సంపాదించుకునే ఛాన్సుంది. మీరు ఇంకా ఎక్కువ మొత్తంలో బిజినెస్ చేస్తే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది.
మీరు మంచి పండ్లను వినియోగిస్తూ రుచికరమైన జ్యూస్ కస్టమర్లకు అందిస్తే క్రమంగా వచ్చే వారి సంఖ్య మరింత పెరగనుంది. దీంతోపాటు స్థానిక వ్యాపార సంస్థలకు జ్యూస్ ఆర్డర్లు ఇవ్వడం ద్వారా మంచి వ్యాపార అవకాశాలను పెంచుకోవచ్చు. దీంతోపాటు ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్ల వంటివి ప్రకటిస్తే ఇంకా ఎక్కువ మంది వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వ్యాపారాన్ని మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం వేళల్లో కూడా నిర్వహించుకోవచ్చు. లేదంటే మీ కుటుంబ సభ్యులతో కూడా ఈ వ్యాపారాన్ని సమన్వయం చేసుకోవచ్చు.