Amrutha Pranay: 2018లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి ఈ రోజు నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ప్రణయ్ హత్యకు సంబంధించి మొత్తం 8 మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. ఏ1 అయిన అమృత తండ్రి మారుతి రావు విచారణ జరుగుతుండగానే హైదరబాద్ లో ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. మిగతా ఏడుగురిలో ఏ2, హంతకుడు సుభాష్ శర్మకు ఉరిశిక్ష పడింది. అమృత బాబాయ్ శ్రవణ్ సహా ఇతర దోషులకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా రెండవ అదనపు సెషన్స్, ఎస్సీ ఎస్టీ కోర్డు తీర్పు వెల్లడించింది. ఈ కేసు తీర్పుపై ప్రణయ్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
ALSO READ: Amrutha Pranay: అమృత ప్రణయ్ ఇప్పుడు ఏం చేస్తోంది? ఎవరి దగ్గర ఉంటోంది?
ప్రణయ్ తండ్రి ఏమన్నారంటే..?
కేసు తీర్పుపై ప్రణయ్ తండ్రి మాట్లాడారు. ‘ఈ తీర్పు వల్ల ప్రణయ్ తల్లిదండ్రులకు వచ్చే లాభం ఏం లేదు. ఏదైనా చర్చల ద్వారా మాట్లాడాలి కానీ చంపుకుంటూ పోతే లాభం లేదు. కొడుకు లేని బాధ తల్లిదండ్రులకే తెలుసు. బాబు లేని లోటు మాకు.. భర్త లేని లోటు అమృతకు.. తండ్రి లేని లోటు నా మనవడికి మాత్రమే తెలుసు. తొందరపాటు చర్యలకు పోకుండా సామరస్యంగా మాట్లాడుకుంటే ఈ రోజు అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళం. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కడుపులో పుట్టిన పిల్లలను చంపుకోవటం వల్ల సమస్య పరిష్కారం కాదు. కేసు శిక్ష పడే విషయంలో ఎంతో కృషి చేసిన అప్పటి నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ కు, మా లాయర్‌కి ధన్యవాదాలు’ తెలియజేశారు.
రంగనాథ్‌కి అమృత ఫోన్ కాల్..
ఈ కేసు తీర్పుపై అమృత ప్రణయ్ కూడా హర్షం వ్యక్తం చేశారు. అప్పటి నల్గొండ ఎస్సీ(ప్రస్తుత హైడా కమిషనర్) గా ఉన్న ఏవీ రంగ నాథ్ కు అమృత ఫోన్ కాల్ చేశారు. ప్రణయ్‌ను చంపిన వ్యక్తికి ఉరి శిక్ష, మిగతావారికి జీవిత ఖైదీ శిక్ష పడేలా.. కేసు నిలబెట్టినందుకు రంగనాథ్‌కు అమృత కృతజ్ఞతలు తెలిపారు. కేసులో తమకు మొదటి నుంచి సహకరించిన అమృతకు కూడా ప్రస్తుత హైడ్రా కమిషనర్ రంగనాథ్ కృతజ్ఞతలు చెప్పారు. అమృతకు హామీ ఇచ్చినట్టు గానే ఇపుడు తీర్పు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
ALSO READ: BIG BREAKING: తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు వచ్చేశాయ్..