CM Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్ చెల్లని రూపాయిలాంటోడని.. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఓ పిచ్చొడని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ గురించి మాట్లాడటం టైం వేస్ట్ అంటూ సీఎం వ్యాఖ్యానించారు. తండ్రికొడుకులు ఇద్దరికి బలుపు తప్ప ఏమీ లేదని మండిపడ్డారు.
ఇలాంటి వారిని ఎక్కడా చూడలేదు..
స్పైడర్ సినిమాలో సూర్య అనే విలన్ లా కేసీఆర్, కేటీఆర్, హరీష్ ల తీరు ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ సినిమాలో సూర్యాలాగానే తెలంగాణలో ఎవరైనా చనిపోతే తీన్ మార్ వేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి వారిని నేను ఎక్కడా చూడలేదు. మేడిగడ్డ లేకుండానే దేశంలో ఎక్కువ వరి పండించాం. చేసిన తప్పులు, అప్పులను ఎన్ని రోజులు కప్పి పుచ్చుతారు. జగన్ ను ప్రగతిభవన్ కు పిలిచి రాయలసీమ లిఫ్ట్ కి అనుమతి ఇచ్చింది కేసీఆర్ కాదా..?. కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఏపీతో తలనొప్పి వచ్చేది కాదు. కాళేశ్వరంకు లక్ష కోట్లు పెట్టాడు. కట్టుడు కూల్చుడు అయ్యింది. కేసీఆర్ కుటుంబానికి అంత బరితెగింపు ఎందుకో..?’ అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘రిజల్ట్ కు.. రిజర్వేషన్ కు సంబంధం లేదు. మందకృష్ణ అంటే నాకు గౌరవం ఉంది. కానీ బీజేపీ నేతల మాదిరిగా మాట్లాడితే ఎలా..? ఏపీలో వర్గీకరణ అమలు చేయలేదు. అందుకు మాదిగలకు న్యాయం జరిగిందా..?. నేను వర్గీకరణ చేశా.. కాబట్టి అన్యాయం జరిగిందా..? ’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కేటీఆర్‌కు సీఎం స్ట్రాంగ్ కౌంటర్
టీడీఆర్ పేరుతో రూ.వేల కోట్టు కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి టీమ్ సిద్దమవుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరని.. కేసులకు భయపడితే క్రైమ్ చేయరని సీఎం వ్యాఖ్యానించారు. అంతకుముందు, కేటీఆర్ టీడీఆర్ పేరుతో రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి టీమ్ సన్నద్ధమవుతోందని బీఆర్ఎస్ మాజీమంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ మహానరగం లో ఉన్న టీడీఆర్ మొత్తం షేర్లను కొంత మంది రేవంత్ రెడ్డి అనుచరులు కొంటున్నారని కామెంట్ చేశారు. త్వరలోనే FSI అమలు చేసి టీడీఆర్ లను అడ్డగోలు ధరకు అమ్మేందుకు కుట్ర జరుగుతోందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరని.. కేసులకు భయపడితే క్రైమ్ చేయరని సీఎం వ్యాఖ్యానించారు. అందుకే కేటీఆర్ కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అసలు కేటీఆర్ గురించి మాట్లాడటం వేస్ట్ అని అన్నారు. కేంద్ర కిషన్ రెడ్డి రాష్ట్రానికి మెట్రో తానే తీసుకొచ్చానని చెప్పుకుంటున్నారని, ఆయన తెచ్చిన మెట్రో ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణకు నిధులు తీసుకొస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్మానం చేస్తామని అన్నారు.
ALSO READ: Buddha Venkanna vs KTR: కేటీఆర్‌కు బుద్ధ మాస్ వార్నింగ్.. ఇంకోసారి విమర్శిస్తే గెలవడం కష్టం
కులగణన ప్రభావంతోనే బీసీలకు టికెట్లు
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం 39 సార్లు కాకపోతే 99 సార్లు ఢిల్లీకి వెళ్తానని తేల్చి చెప్పారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి కావల్సినవి తెచ్చుకుంటానని పేర్కొన్నారు. రాష్ట్రానికి కావాల్సిన అనేక అంశాలను పరిష్కరించుకొని వచ్చినట్లు చెప్పారు. కుల గణన ప్రభావంతోనే అన్ని పార్టీలు బీసీలకు టికెట్లు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.