E-Paper
Advertisement

కాలేజీ చదువుతో పాటు బిజినెస్.. కేవలం 50 రోజుల్లో రూ.15 లక్షలు సంపాదించిన స్టూడెంట్.. ఎలాగంటే

కాలేజీ చదువుతో పాటు బిజినెస్.. కేవలం 50 రోజుల్లో రూ.15 లక్షలు సంపాదించిన స్టూడెంట్.. ఎలాగంటే
Advertisement

student Entrepreneur| సాధారణంగా 21 ఏళ్ల వయసులో కాలేజీ చదువులు, పరీక్షలు, ఉద్యోగ అవకాశాల గురించి విద్యార్థులు ఆలోచిస్తుంటారు. కానీ గురుగ్రామ్‌కు చెందిన అనన్య అగర్వాల్ మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించింది. చదువుకుంటూనే సొంతంగా రెస్టారెంట్ వ్యాపారాన్ని ప్రారంభించింది. కేవలం 50 రోజుల్లోనే ఆమె ప్రారంభించిన కేఫ్ రూ.15 లక్షల ఆదాయాన్ని ఆర్జించినట్లు సమాచారం. చదువు, వ్యాపారం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న అనన్య ప్రయాణం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

చదువుకుంటూనే సొంతంగా కేఫ్ ప్రారంభించిన అనన్య

అనన్య అగర్వాల్ ప్రస్తుతం బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (BMS) చివరి సంవత్సరం చదువుతోంది. ఈ సమయంలోనే తన తల్లిదండ్రులతో కలిసి గురుగ్రామ్‌లో ‘లూమ్ అండ్ లైమ్’ పేరుతో వెజిటేరియన్ బిస్ట్రో కేఫ్ ప్రారంభించింది.
కాలేజీకి వెళ్లడం, అసైన్‌మెంట్లు పూర్తి చేయడం, పరీక్షలకు సిద్ధమవడం వంటి బాధ్యతలతో పాటు కేఫ్ నిర్వహణను కూడా చూసుకుంటోంది. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడం కొంత కష్టమైనప్పటికీ, వ్యాపారంపై తనకు ఎంతో ఆసక్తి ఉందని అనన్య తెలిపింది.
ప్రమఖ సోషల్ మీడియా ఛానెల్ కర్లీ టేల్స్‌తో అనన్య మాట్లాడుతూ.. వ్యాపారం చేస్తూనే ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పింది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తనకు ఎంతో ముఖ్యమని వెల్లడించింది.

అంతర్జాతీయ వంటకాల రియల్ టేస్ట్ అందించాలనేది లక్ష్యం

Advertisement

అనన్య కేవలం మరో రెస్టారెంట్‌ ప్రారంభించాలని అనుకోలేదు. కస్టమర్లు ప్రశాంతమైన వాతావరణంలో మంచి ఆహారాన్ని ఆస్వాదించేలా ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంది.
ముఖ్యంగా ఇటాలియన్, మెక్సికన్, మెడిటరేనియన్ వంటకాల అసలైన రుచులను అందించాలని నిర్ణయించుకుంది. భారతదేశంలో అంతర్జాతీయ వంటకాలకు స్థానిక మసాలాలు, రుచులు ఎక్కువగా జోడిస్తున్నారని ఆమె అభిప్రాయపడింది. దీంతో ఆయా వంటకాల అసలైన ప్రత్యేకత తగ్గిపోతుందని వివరించింది. అందుకే తన కేఫ్‌లో సంప్రదాయ రుచులను సాధ్యమైనంతవరకు అలాగే అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read: బంగారం కొనాలనుకుంటున్నారా? మేకింగ్ ఛార్జీలు లేకుండా కొనేందుకు 5 మార్గాలు

తల్లిదండ్రులతో కలిసి వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అనన్య

Advertisement

అనన్య తన తల్లిదండ్రులు డాక్టర్ విశాల్ అగర్వాల్, ప్రీతి అగర్వాల్‌తో కలిసి ఈ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఆమె తండ్రికి 10 ఏళ్లకు పైగా వ్యాపార రంగంలో అనుభవం ఉంది. ఆయన అనుభవం నుంచి అనన్య ఎన్నో విషయాలు నేర్చుకుంటోంది. బిజినెస్ మీటింగ్స్, బ్రాండ్ ప్రమోషన్స్, రెస్టారెంట్ నిర్వహణ వంటి అంశాలను గమనిస్తోంది. మేనేజ్‌మెంట్ చదువుతో పాటు నిజ జీవితంలో వ్యాపార నిర్వహణ ఎలా ఉంటుందో కూడా తెలుసుకుంటోంది.

కేఫ్‌లో ఎలాంటి ఆహార పదార్థాలు లభిస్తాయి?

లూమ్ అండ్ లైమ్ పూర్తిగా శాకాహార వంటకాలు అందించే బిస్ట్రో. ఇందులో ఇటాలియన్, మెక్సికన్, మెడిటరేనియన్ వంటకాలే ప్రధానంగా ఉంటాయి.

  •  బ్రిక్ ఓవెన్ పిజ్జాలు
  •  హ్యాండ్‌మేడ్ పాస్తాలు
  •  మెక్సికన్ టాకోస్
  •  మెజ్జే ప్లాటర్లు
  •  ప్రత్యేకమైన బ్రెడ్స్
  •  వివిధ రకాల ఫ్రైస్
  •  స్పెషాలిటీ కాఫీ, డ్రింక్స్
  •  డెజర్ట్స్, వీగన్ ఆప్షన్లు
    కేఫ్ ఇన్‌స్టాగ్రామ్ సమాచారం ప్రకారం.. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఓపెన్ ఉంటుంది.

Also Read: రాత్రి హైవేపై పంక్చర్‌తో ఆగిన లగ్జరీ కారు.. ఉదయం చూస్తే పూర్తిగా దగ్ధం.. బీమా నిరాకరించిన కంపెనీపై కేసు

50 రోజుల్లో రూ.15 లక్షల ఆదాయం సాధించిన కేఫ్

కేఫ్ ప్రారంభించిన మొదటి 50 రోజుల్లోనే రూ.15 లక్షల ఆదాయం వచ్చినట్లు సమాచారం. కాలేజీ చదువు కొనసాగిస్తూనే వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం అనన్యకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం ఆమె ముందున్న లక్ష్యం చదువు పూర్తి చేయడంతో పాటు కేఫ్‌ మరింత అభివృద్ధి చేయడం. చిన్న వయసులోనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన అనన్య ప్రయాణం యువతకు ఆసక్తికరమైన ఉదాహరణ.

Related News

జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం లేదా? మీరు చేస్తున్న తప్పులివే

ఎఫ్‌డీఏ సంచలన నిర్ణయం.. బ్లింకిట్, జెప్టో సహా.. 105 సంస్థల ఫుడ్ లైసెన్సులు రద్దు!

సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? జాగ్రత్త ఈ 5 విషయాలు తప్పక చెక్ చేయండి

బంగారం కొనాలనుకుంటున్నారా? మేకింగ్ ఛార్జీలు లేకుండా కొనేందుకు 5 మార్గాలు

రాత్రి హైవేపై పంక్చర్‌తో ఆగిన లగ్జరీ కారు.. ఉదయం చూస్తే పూర్తిగా దగ్ధం.. బీమా నిరాకరించిన కంపెనీపై కేసు

ఉద్యోగం ఊడింది.. కానీ రూ. 9 లక్షల ఆఫర్ వచ్చింది! లేఆఫ్స్‌లో ట్రెండ్ సెట్ చేసిన కాన్వా

దలాల్ స్ట్రీట్‌లో దీపావళి పండగ.. ఫుల్‌జోష్‌లో మదుపరులు, పాత మార్క్‌ని టచ్ చేసిన సెన్సెక్స్-నిఫ్టీలు

Big Stories

Advertisement
×