E-Paper
Advertisement

జొమాటో కొత్త ఫీచర్ చూశారా? ఇక 40 కి.మీ దూరం నుంచైనా ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు!

జొమాటో కొత్త ఫీచర్ చూశారా? ఇక 40 కి.మీ దూరం నుంచైనా ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు!
Advertisement

Zomato Limitless Delivery: ప్రముఖ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫామ్ ‘జొమాటో’ తన వినియోగదారుల కోసం సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. నగరంలో దూరంగా ఉండే ప్రముఖ రెస్టారెంట్ల నుంచి కూడా ఆహారాన్ని సులభంగా ఆర్డర్ చేసుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా జొమాటో పరిధిలోకి భారీ ఎత్తున కొత్త రెస్టారెంట్లు రానున్నాయి.

ఇంతకీ ఏంటీ సదుపాయం?

జొమాటో కొత్తగా తీసుకొచ్చిన ఈ సదుపాయం పేరు ‘లిమిట్‌లెస్ డెలివరీ’ (Limitless Delivery). సాధారణంగా మన ఇంటికి సమీపంలో ఉన్న రెస్టారెంట్లు మాత్రమే యాప్‌లో కనిపిస్తుంటాయి. కానీ ఈ ఫీచర్ ద్వారా ఒకే నగరంలో దాదాపు 40 కిలోమీటర్ల పరిధిలోని భాగస్వామ్య రెస్టారెంట్ల నుంచి కూడా మీకు నచ్చిన వంటకాలను ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే నగరంలో ఏ మూలన ఉన్న ఫేవరెట్ హోటల్ ఫుడ్ అయినా ఇకపై ఇంటి ముందుకు వచ్చేస్తుంది.

ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి?

Advertisement

జొమాటో యాప్ హోమ్‌పేజీ తెరవగానే ‘ఎక్స్‌ప్లోర్ మోర్’ (Explore More) సెక్షన్ కనిపిస్తుంది. అందులో ఉన్న ‘లిమిట్‌లెస్ డెలివరీ’ షార్ట్‌కట్‌పై క్లిక్ చేస్తే దూరంగా ఉండి కూడా మీ ప్రాంతానికి డెలివరీ చేసే రెస్టారెంట్ల జాబితా కనిపిస్తుంది. లేదంటే మీకు కావలసిన రెస్టారెంట్ పేరును నేరుగా సెర్చ్ చేసి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు.

ఏ ఏ నగరాల్లో ఉందంటే?

ఈ ‘లిమిట్‌లెస్ డెలివరీ’ సేవలను ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రారంభించారు. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, పుణే నగరాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. కస్టమర్లు తమకు ఇష్టమైన ఆహారానికి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జొమాటో సీఈఓ ఆదిత్య మంగ్లా తెలిపారు.

Advertisement

Also Read: రాహుల్ గాంధీ గారూ.. ఈ దోపిడీకి కొత్త పదం ఏమైనా ఉందా? – KTR వ్యంగ్యాస్త్రాలు

ఈ విషయాలు గుర్తుంచుకోండి!

ఈ కొత్త ఆఫర్ లో రెస్టారెంట్ల పరిధి 40 కిలోమీటర్లు అని చెప్పినప్పటికీ ఆ పరిధిలోని అన్ని రెస్టారెంట్లు డెలివరీకి అందుబాటులో ఉండకపోవచ్చు. రెస్టారెంట్ నిబంధనలు, ఆ సమయంలో డెలివరీ బాయ్స్ అందుబాటులో ఉన్నారా? లేదా? అనే దానిపై ఆధారపడి ఆర్డర్స్ తీసుకోనున్నారు. దూరప్రాంతాల ఆర్డర్లకు డెలివరీ ఛార్జీలు ఏమైనా పెరుగుతాయా? లేదా? సమయం ఎంత పడుతుంది? అనే విషయాలపై జొమాటో నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read: దేశంలో వింత స్టేషన్.. రైలు ఎక్కాలంటే టికెట్ ఒక్కటే సరిపోదు.. వీసా, పాస్‌పోర్ట్ కూడా ఉండాల్సిందే!

Tags

Related News

జనవరి 1 నుంచి కొత్త చెక్ బుక్ రూల్స్.. రూ.50 వేలు దాటితే పాత చెక్కులు చెల్లవా? ఆర్‌బీఐ ఏమందంటే!

కాలేజీ చదువుతో పాటు బిజినెస్.. కేవలం 50 రోజుల్లో రూ.15 లక్షలు సంపాదించిన స్టూడెంట్.. ఎలాగంటే

జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం లేదా? మీరు చేస్తున్న తప్పులివే

ఎఫ్‌డీఏ సంచలన నిర్ణయం.. బ్లింకిట్, జెప్టో సహా.. 105 సంస్థల ఫుడ్ లైసెన్సులు రద్దు!

సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? జాగ్రత్త ఈ 5 విషయాలు తప్పక చెక్ చేయండి

బంగారం కొనాలనుకుంటున్నారా? మేకింగ్ ఛార్జీలు లేకుండా కొనేందుకు 5 మార్గాలు

రాత్రి హైవేపై పంక్చర్‌తో ఆగిన లగ్జరీ కారు.. ఉదయం చూస్తే పూర్తిగా దగ్ధం.. బీమా నిరాకరించిన కంపెనీపై కేసు

Big Stories

Advertisement
×