BigTV English

2024 Suzuki Avenis Launched: సుజికి అవెనిస్ లాంచ్.. దీనిలో కొత్త ఫీచర్లు ఏమి ఉన్నాయో తెలుసా?

2024 Suzuki Avenis Launched: సుజికి అవెనిస్ లాంచ్.. దీనిలో కొత్త ఫీచర్లు ఏమి ఉన్నాయో తెలుసా?

2024 Suzuki Avenis Launched: టూవీలర్ కంపెనీ సుజికి దేశంలో 2024 అవెనిస్ 125ని విడుదల చేసింది. దీని ధర రూ. 92,000 ఎక్స్‌షోరూమ్‌గా ఉంది. ఈ స్కూటీ లెటెస్ట్ మోడల్, కొత్త కలర్ వేరియంట్లతో వస్తుంది. దీని డిజైన్ ఈ జనరేషన్‌కి తగ్గట్టుగా ఫుల్లీ అప్‌డేట్‌తో వస్తుంది. ఇందులో నాలుగు కొత్త పవర్ ‌ఫుల్ సైడ్ ప్యానెల్‌లు, ఫ్రంట్ ఆకట్టుకొనే డిజైన్‌ ఉంటుంది. కంపెనీ ఈ స్కూటర్‌ను స్టాండర్డ్, రేస్ ఎడిషన్ అనే రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. ఇప్పుడు దీని ధర, ఫీచర్లను చూద్దాం.


ఈ కొత్త 2024 సుజుకి అవెనిస్ స్కూటర్ రెండు వేరియంట్లలో వస్తుంది. 2024 సుజుకి అవెనిస్ స్టాండర్డ్, రేస్ ఎడిషన్‌లో అందుబాటులో ఉంది. ఇందులో, స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 92,000 నుండి ప్రారంభం కాగా, రేస్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.92,800. స్కూటర్ అనేక ఆకర్షణీయమైన రంగు ఎంపికలలో విడుదలైంది. ఇందులో గ్లోసీ స్పార్కిల్ బ్లాక్, పెరల్ మీరా రెడ్, ఛాంపియన్ ఎల్లో, గ్లోసీ స్పార్కిల్ బ్లాక్, గ్లోసీ స్పార్కిల్ బ్లాక్/పెరల్ గ్లేసియర్ వైట్ వంటి కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి.

2024 సుజుకి అవెనిస్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే  ఇందులో ప్యానెల్‌లో బోల్డ్ సుజుకి బ్రాండింగ్‌ను కలిగి ఉంది. ఇది కొత్త లుక్ ఇస్తోంది. అవెనిస్ 125 124cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో దాని మెకానికల్ సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 8.5బిహెచ్‌పి పవర్, 10ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. CVT గేర్‌బాక్స్‌తో సమర్థవంతమైన పనితీరును అందిస్తుంది.


Also Read: Bike Under 60000: రూ.60 వేలకే హీరో బైక్.. 65 కిమీ మైలేజ్.. 11 రంగుల్లో కొనుగోలు చేయవచ్చు!

2024 సుజుకి అవెనిస్ రైడర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి సరికొత్త టెక్నాలజీ ఫీచర్‌లతో వస్తుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీని, సుజుకి రైడ్ కనెక్ట్ యాప్‌తో సింక్ చేసే పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందిస్తుంది. ఈ ఫీచర్లు కాల్‌ల కోసం టర్న్-బై-టర్న్ నావిగేషన్, అలర్ట్‌లను అందిస్తాయి. స్కూటర్‌లో USB ఛార్జింగ్ పోర్ట్, ఫ్రంట్ ర్యాక్, సైలెంట్ స్టార్టర్, సైడ్ స్టాండ్ ఇంటర్‌లాక్, యుటిలిటీ హుక్, ఇంటిగ్రేటెడ్ ఇంజన్ స్టార్ట్ స్విచ్, LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్స్, 21.8-లీటర్ పెద్ద అండర్-సీట్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ కూడా ఉన్నాయి.

Related News

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Big Stories

×