BigTV English

Swiggy, Zomato Increased Fee: జొమాటో, స్విగ్గీ ఛార్జీల మోత.. ఆర్డర్‌పై ఫీజు పెంపు..!

Swiggy, Zomato Increased Fee: జొమాటో, స్విగ్గీ ఛార్జీల మోత.. ఆర్డర్‌పై ఫీజు పెంపు..!

Swiggy, Zomato Increased Fee: జొమాటో, స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌ ఫీజును పెంచాయి. డిమాండ్‌ ఉన్న నగరాల్లో ఇకపై ప్రతీ ఆర్డర్‌కు రూ. 6 వసూలు చేయనున్నాయి. తమ సేవలను మెరుగుపరిచేందుకు ఛార్జీలు పెంచి నట్లు సదరు కంపెనీలు చెబుతున్నాయి. వేగంగా కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేస్తామని చెబుతున్నాయి. దీంతో ఆ కంపెనీల ఆదాయం పెరగనుంది.


దేశంలో ఎన్నికల ముగిశాయి. ఇప్పుడు కంపెనీల వంతైంది.వీలైనంత త్వరగా వినియోగదారులపై ఛార్జీలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. తొలుత బ్యాంకులు, మొన్న టెలికాం వంతైంది. నిన్న ఎఫ్ఎంసీజీ.. ఇవాళ జొమాటో, స్విగ్గీ యాప్‌ల వంతైంది. ఎవరు చూసినా సామాన్యుడిపైనే భారం మోపుతున్నారు. ఒకవేళ ప్రశ్నిస్తే.. మెరుగైన సదుపాయాలు, క్వాలిటీ అంటూ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి సామాన్యుడికి ఆ రేంజ్‌‌లో ఆదాయం వస్తుందంటే చెప్పడం కష్టమే.

ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీలు ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచేశాయి. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల వంతైంది. ప్రతీ ఆర్డర్‌పై ఫీజు ఐదు రూపాయలు ఉండగా, దాన్ని ఆరుకి పెంచాయి. దీంతో ఆయా కంపెనీలు 20శాతం వరకు రేట్లు పెంచినట్లైంది. బెంగుళూరులో స్విగ్గీ ఏడు రూపాయలు ఉండగా, రాయితీ తర్వాత ఆరుకి తగ్గింది. ఈ యాప్‌లు ఫీజులు పెంచడం ఇదేమీ తొలిసారి కాదు.


Also Read: చీపెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. ధర తక్కువ.. రేంజ్ చాలా ఎక్కువ!

జొమాటో, స్విగ్గీ కంపెనీలు ఆ తరహా ఫీజును ఏడాది కిందట ప్రవేశపెట్టాయి. రెండు రూపాయాలు మొదలు పెట్టి అక్కడి నుంచి క్రమంగా పెంచుతూ వచ్చాయి. జొమాటో అయితే 25శాతం పెంచి రెండు రూపాయల ను ఐదు వరకు తీసుకెళ్లింది. ఢిల్లీ, బెంగుళూరు, ముంబై, హైదరాబాద్, లక్నో వంటి సిటీలకు పెంచి ఫీజు వర్తిస్తాయని తెలిపాయి. ఇంకా వేగంగా డెలివరీ కావాలంటే ప్రత్యేక రుసుము పద్దతిని ప్రవేశపెట్టాయి.. మరికొన్ని పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇక జొమాటో, స్విగ్గీలకు చెందిన ఈ కామర్స్ వేదికలైన బ్లింకిట్, ఇన్ స్టా మార్ట్ సైతం హ్యాండ్లింగ్ ఛార్జీల పేరిట ఫీజు వసూలు చేస్తున్నాయి. బ్లింకిట్ ఒక్కో ఆర్డర్‌పై నాలుగు రూపాయలు, ఇన్ స్టా‌మార్ట్ ఐదు రూపాయలు వసూలు చేస్తున్నాయి.

Tags

Related News

Reko Diq Gold Mine: రెకోడిక్ బంగారు గని.. ఇక్కడ 5లక్షల కోట్ల విలువైన బంగారం.. ఇది బిగ్గెస్ట్ జాక్‌పాట్..!

Top 6 Clothing Brands: జుడియో తరహాలోనే వీటిలో కూడా దుస్తులు చాలా చీప్, వెంటనే ట్రై చెయ్యండి!

SBI Cards: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. సెప్టెంబర్ 1 నుంచి న్యూ రూల్స్

Zudio షోరూమ్‌కు ఎందుకంత క్రేజ్? ధరలు ఎందుకంత తక్కువ?

Gold Rate Today: కాస్త ఊరటగా బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే

CIBIL Score: లోన్ తీసుకునేవారికి తీపికబురు.. సిబిల్ స్కోర్ తప్పనిసరికాదు

Big Stories

×