BigTV English

Kalki 2898 AD – Prabhas Special Video: థాంక్యూ డార్లింగ్స్.. ప్రభాస్ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన వైజయంతి మూవీస్

Kalki 2898 AD – Prabhas Special Video: థాంక్యూ డార్లింగ్స్.. ప్రభాస్ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన వైజయంతి మూవీస్

Kalki 2898 AD – Prabhas Special Video: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము దులిపేస్తుంది. కాగా ముందుగా ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇంత పెద్ద స్టార్ ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ సినిమా తీయగలడా అనే సందేహం అందరిలోనూ కలిగింది. అదీగాక నాగ్ అశ్విన్ అప్పటికి చేసింది రెండే రెండు సినిమాలు. కల్కి అతడి మూడో సినిమా. అందువల్ల ప్రభాస్‌ను హ్యాండిల్ చేయగలడా అనే ఆలోచన ఉండేది. అయితే ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్‌ రిలీజ్ చేయగా సినీ ప్రేక్షకుల్లో ఒకింత నమ్మకం కలిగింది. అలా పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేసి కల్కిపై ఫుల్ హైప్ క్రియేట్ చేశారు.


ఆపై బుజ్జి పేరుతో ఓ ఈవెంట్ నిర్వహించి మంచి బజ్ క్రియేట్ చేశారు. ఆపై ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు అమాంతంగా పెంచేశారు. అలా భారీ అంచనాలతో జూన్ 27న గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా మాస్ రెస్పాన్స్‌తో అదరగొట్టేస్తుంది. భాషతో సంబంధం లేకుండా భారీ స్పందనతో పరుగులు పెడుతోంది. మైథాలజీ సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కిన ఈ సినిమా యావత్ సినీ ప్రేక్షకుల్ని విజువల్ ఎఫెక్ట్స్‌తో కట్టిపడేసింది. దీంతో ప్రపంచ నలుమూలల నుంచి సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మేరకు బాక్సాఫీను షేక్ చేసింది. ఊహించినట్లు గానే కల్కి 2898 ఏడీ సినిమా రూ.1000 కోట్లు క్రాస్ చేసేసింది.

త్వరలో రూ.1100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని పలువురు ట్రేడ్ నిఫుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు 3 వారాలు కావస్తున్నా ఈ సినిమాకి రెస్పాన్స్ ఇంకా తగ్గలేదు. దానికి తోడు ఈ మధ్య పెద్ద సినిమాలేవి లేవు. జూన్ 12న భారీ అంచనాలతో రిలీజ్ అయిన ‘ఇండియన్ 2’ కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. దీంతో అది కల్కి సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. కలెక్షన్లకు గండి పడకుండా కొనసాగుతూనే ఉంది.


Also Read: కల్కి నుంచి మరో సర్‌ప్రైజ్.. యాక్షన్ సన్నివేశాల మేకింగ్ వీడియో రిలీజ్..!

ఇదిలా ఉంటే ఈ మూవీ భారీ సక్సెస్‌తో చిత్రబృందం ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మూవీ యూనిట్ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. అందులో ఆండి లాంగ్ అనే ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ తన స్టైల్ అండ్ క్రియేటివిటీని చూపించే విధానాన్ని ఆ వీడియోలో చూపించారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ప్రభాస్ వంటి నటీ నటుల యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించారు.

ఇక ఇప్పుడు ప్రభాస్‌కు సంబంధించి మరో వీడియోను వదిలారు. ఈ మేరకు కల్కి సినిమా ఇంతటి భారీ విజయం సాధించడం పట్ల ప్రభాస్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విజయాన్ని ఇంతలా ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు ప్రభాస్ థాంక్స్ చెప్పాడు. కల్కి కోసం 5ఏళ్లు కష్టపడ్డ దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వినీ దత్‌కు స్పెషల్ థాంక్స్ తెలిపాడు. అంతేకాకుండా సినిమాలో నటించిన భారీ తారగణంపై ప్రసంశలు కురిపించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Tags

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×