BigTV English

Tata Altroz ​​Racer Teaser: ఫీచర్లతో ఫిదా చేస్తున్న ‘టాటా ఆల్ట్రోజ్ రేసర్’.. స్పోర్టీ లుక్ వేరే లెవెల్..!

Tata Altroz ​​Racer Teaser: ఫీచర్లతో ఫిదా చేస్తున్న ‘టాటా ఆల్ట్రోజ్ రేసర్’.. స్పోర్టీ లుక్ వేరే లెవెల్..!

tata altroz racer specifications: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్‌ కార్లకు మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. అంతేకాకుండా దేశీయంగా అత్యధికంగా విక్రయింబడుతున్న కార్లలో ఈ కంపెనీ కార్లు కూడా ముందు వరుసలో ఉన్నాయి. అందువల్లనే కంపెనీ కొత్త కొత్త మోడళ్లతో వాహన ప్రియుల్ని అట్రాక్ట్ చేస్తుంది. బడ్జెట్ ధరలో కొత్త కార్లను తీసుకువచ్చి ఫీచర్లతో ఫిదా చేస్తుంది. అయితే ఇప్పుడు తన మోడల్‌లోని మరొక హ్యాచ్‌బ్యాక్‌ను తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.


ఇందులో బాగంగానే టాటా మోటార్స్ కొత్త హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ ‘టాటా ఆల్ట్రోజ్ రేసర్’(Tata Altroz ​​Racer) మొదటి టీజర్ విడుదలైంది. వచ్చే నెలలో ఈ వాహనం విక్రయాలు ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. 2023లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో, ఆ తర్వాత భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఆల్ట్రోజ్ రేసర్ దర్శనమిచ్చింది. ఇక ఇప్పుడు విడుదల అయిన టీజర్ ప్రకారం.. దీనిలో ఆరెంజ్-బ్లాక్ పెయింట్, పొడిగించిన బ్యాక్ స్పాయిలర్‌లు కనిపిస్తాయి. అంతేకాకుండా ఇది స్పోర్టీ లుక్‌తో ఫిదా చేస్తుంది.

Tata Altroz ​​Racer design


ఆల్ట్రోజ్ రేసర్ డిజైన్ విషయానికొస్తే.. ఇది బయట రియర్‌వ్యూ మిర్రర్స్ (ORVMలు) సహా బ్లాక్-అవుట్ పిల్లర్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది కాకుండా దీనికి రీడిజైన్ చేయబడిన స్పాయిలర్‌ను కూడా ఇవ్వవచ్చు అని అంటున్నారు. దీని పొడవు 3,990 మిమీ కాగా వెడల్పు 1,755 మిమీ ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ ఆల్ట్రోజ్ రేసర్ వాహనం పొడవు ఇటీవల విడుదలైన మారుతి సుజుకి ఫ్రాంక్స్ టర్బోతో సమానంగా ఉంటుందని అంచనా వేయబడింది.

Also Read: ఈ ఏడాది లాంచ్ కానున్న క్యూటెస్ట్ కార్లు ఇవే.. ఫీచర్స్, లుక్స్ అదుర్స్

Tata Altroz ​​Racer features and Performance

టాటా నెక్సాన్‌లో ఉండే 1.2 లీటర్ల టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను.. ఇప్పుడు టాటా కొత్త హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ టాటా ఆల్ట్రోజ్ రేసర్‌లో ఉపయోగించవచ్చని అంటున్నారు. దీని మూడు సిలిండర్ యూనిట్లు 170 Nm పీక్ టార్క్, 118 bhp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేయగలవు. ఇప్పటివరకు వచ్చిన నివేదికల ప్రకారం.. టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఇంటీరియర్ పూర్తిగా బ్లాక్ థీమ్‌ను అందించవచ్చని భావిస్తున్నారు.

అలాగే ఇది 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందవచ్చు. దీనితో పాటు ఈ వాహనం 360 డిగ్రీ కెమెరాతో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, కొత్త 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, వాయిస్ కమాండ్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్‌ను కూడా పొందవచ్చు. అయితే ఇప్పటి వరకు ఈ వాహనం లాంచ్ తేదీ, ధరను కంపెనీ వెల్లడించలేదు. అందువల్ల వీటి కోసం మరిన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంచనా ప్రకారం.. ఈ వెహికల్ ధర Altroz ​​మోడల్ కంటే ఎక్కువగా ఉండవచ్చు. ఇది దాని వనిల్లా వెర్షన్‌తో అందించబడిన అల్లాయ్ వీల్స్‌తో సహా అదే సెట్ హెడ్, టెయిల్ ల్యాంప్‌లను ముందుకు తీసుకువెళుతుంది.

Tags

Related News

E20 Petrol: E20 పెట్రోల్ అంటే ఏంటి? దానివల్ల వాహనాలకు లాభమా? నష్టమా?

Income Tax Bill: ఇన్ కమ్ ట్యాక్స్ బిల్-2025 మనకు ఒరిగేదేంటి? తరిగేదేంటి?

Minimum Balance Account: బ్యాంకు మినిమమ్ బ్యాలెన్స్ కొత్త నియమాలు.. పెనాల్టీ తప్పదా?

Trump On Gold: దిగొచ్చిన పసిడి.. ‘బంగారు’ మాట చెప్పిన ట్రంప్, ఏమన్నారు?

PM-KMY Scheme: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ స్కీంలో నెలకు రూ. 55 కడితే చాలు..ఉద్యోగం చేయకపోయినా పెన్షన్ గ్యారంటీ..

BSNLలో 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవే…ఏకంగా 600 జీబీ డేటా పొందే ఛాన్స్…ఎంత రీచార్జ్ చేయాలంటే..?

Big Stories

×