2024 Upcoming Cutest Cars in India: ప్రస్తుతం దేశంలో ఎస్‌యూవీల డిమాండ్ హైలో నడుస్తుంది. అందుకే ప్యాసింజర్ వెహికల్స్ రికార్డ్ డిస్పాచ్‌లను నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను ఆటో మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. ఏదేమైనప్పటికీ ఆటో ఇండస్ట్రీలో హ్యాచ్‌బ్యాగ్ సెగ్మెంట్ స్థిరమైన నష్టాలను చూస్తోంది. రాబోయే 2-3 సంవత్సరాలలో చిన్న కార్ల అమ్మకాలు పెరుగుతాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. ఈ సంవత్సరం కనీసం ఐదు కొత్త హ్యాచ్‌బ్యాగ్ కార్లు విడుదల కానున్నాయి.
Maruti Swift Dzire
కొత్త జనరేషన్ మారుతి స్విఫ్ట్ మే 9న విడుదల కానుంది. అయితే కొత్త డిజైర్ 2024 పండుగ సీజన్‌లో వచ్చే అవకాశం ఉంది. రెండు మోడళ్లలో కారు లోపల, బయట పెద్ద మార్పులు ఉంటాయి. వీటిలో సుజుకి కొత్త 1.2L, 3-సిలిండర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన ఈ ఇంజన్ గరిష్టంగా 81.6PS పవర్‌ని 112Nm టార్క్ రిలీజ్ చేస్తుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 25.72kmpl. ట్రాన్స్‌మిషన్ కోసం 5-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఉంటాయి. ఇప్పటికే ఉన్న మోడళ్లతో పోలిస్తే వీటిలో చాలా కొత్త ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.
Nissan Magnite Facelift
జపనీస్ ఆటోమేకర్ సబ్-కాంపాక్ట్ SUV నిస్సాన్ మాగ్నైట్ ఈ సంవత్సరం దాని మొదటి మిడ్-లైఫ్ అప్‌డేట్‌ను తీసుకురానుంది. ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ గురించిన వివరాలు ఇంకా అందుబాటులో లేవు. అయితే 2024 నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌లో చిన్న చిన్న కాస్మెటిక్ మార్పులుతో పాటు ఫీచర్ అప్‌గ్రేడ్‌లు ఉండే అవకాశం ఉంది. ఇది 1.0L పెట్రోల్, 1.0L టర్బో పెట్రోల్, CNGతో అదే పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉండవచ్చు.
Also Read: డ్యూక్‌కు పోటీగా పల్సర్ NS400Z లాంచ్.. ధర ఎంతంటే?
అప్‌డేట్ చేయబడిన Magnite కొత్త సీట్లు, ఇంటీరియర్ థీమ్‌ను ఇందులో చూడొచ్చు. అయితే ఇప్పటికే ఉన్న మోడల్ నుండి అనేక ఫీచర్లు తీసుకోవచ్చు. ప్రస్తుత Magnite 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వాయిస్ రికగ్నిషన్ కంట్రోల్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌తో వస్తుంది.
Tata altroz racer
టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాగ్ లైనప్ త్వరలో రేసర్ ఎడిషన్‌లో మార్కెట్‌లోకి రానుంది. హ్యాచ్‌బ్యాగ్ ఈ స్పోర్టియర్ వెర్షన్ రెండు డిఫరెంట్ డ్యూయల్-టోన్ షేడ్స్‌లో కనిపించింది. ఇది బానెట్, రూఫ్‌పై ట్విన్ రేసింగ్ షేడ్స్, పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ ఫెండర్‌పై రేసర్ బ్యాడ్జింగ్, కొత్తగా రూపొందించిన 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇంటీరియర్‌లో ఆల్ట్రోజ్ రేసర్ కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో కొత్త లెథెరెట్ సీట్లు. అలానే వాటిపై ఎంబోస్డ్ రేసర్ లోగోను ఉంటుంది.
Also Read: డుకాటి నుంచి స్పోర్టీ బైక్.. ధర తెలిస్తే నోరెళ్లబెడతారు
టాటా ఆల్ట్రోజ్ రేసర్ 1.2L, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 120bhp పవర్, 170Nm అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ఫ్రంట్-వీల్-డ్రైవ్ సెటప్‌తో వస్తుంది. ఇది కాకుండా, Altroz హ్యాచ్‌బ్యాక్ 2024లో ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌ను కూడా పొందుతుంది. కొన్ని కొత్త అధునాతన ఫీచర్లు ఇందులో చేర్చబడతాయి. అయితే దీని ఇంజన్ సెటప్ ఇప్పటికే ఉన్న మోడల్ మాదిరిగానే ఉంటుంది.