BigTV English
Advertisement

Samchai: ఏదేమైనా ‘సామ్ చై’ లో ఉన్నంత సంతోషం ‘శోచై ‘ లో లేదురా

Samchai: ఏదేమైనా ‘సామ్ చై’  లో ఉన్నంత సంతోషం ‘శోచై ‘ లో లేదురా

Samchai: లైఫ్.. ఎవరిని ఎప్పుడు కలుపుతుంది.. ఎందుకు విడదీస్తుంది.. అనేది ఎవరికి తెలియదు. ఎంతో ప్రేమించుకొని, పెళ్లి చేసుకున్న జంటలు చిన్న చిన్న విభేదాలతో విడిపోతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు, విడాకులు, మళ్లీ పెళ్లిళ్లు అంతా కామన్ గా మారిపోయాయి. కానీ, ఇండస్ట్రీలో అభిమానులు మాత్రం అలానే ఉండిపోయారు. ఒక జంటను మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన ఫ్యాన్స్.. వారు విడిపోయినా కూడా ఇంకా వారినే తాము అభిమానిస్తున్నామని చెప్పుకోస్తున్నారు.


ఇప్పుడు సమంత- నాగ చైతన్య అభిమానులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కుంటున్నారు. ఏ మాయ చేసావే సినిమాతో సామ్.. చైకు పరిచయమయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారి 2017 లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు చై అభిమానులు .. ఇటు సామ్ అభిమానులు ఈ పెళ్లి గురించి కథలు కథలుగా చెప్పుకొచ్చారు.

అద్భుతమైన జంట.. జంట అంటే ఇలా ఉండాలి. ఎంత అందంగా ఉన్నారు. జీవితాంతం ఇలాగే ఉండాలి అంటూ ఆశీర్వదించారు. కానీ, ఆ జంటకు ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ, ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యి నాలుగేళ్లు కూడా నిండకుండానే విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ రోజు విడిపోయిన దగ్గరనుంచి ఈరోజు వరకు ఈ జంట కనీసం ముఖముఖాలను కూడా చేసుకోలేదని టాక్. చై..


సామ్ గురించి ప్రతి ఇంటర్వ్యూలో మాట్లాడుతూనే ఉంటాడు. సామ్ మాత్రం.. భర్త అని కూడా కాకుండా మాజీ భర్త అని పిలవాలని చెప్పుకొచ్చింది. ఇలా వీరి మీద ఎన్ని విమర్శలు వచ్చినా వారి ఫ్యాన్స్ మాత్రం వీరిని జంటగా చూడడానికి ఇష్టపడుతున్నారు. నేడు చై.. హీరోయిన్ శోభితాతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నా కూడా.. వీరి జంట బావుంది. కానీ, సామ్ చై జంట ఇంకా బావుండేది అని చెప్పుకొస్తున్నారు.

అంతేకాకుండా #samchai ట్యాగ్ ను కాస్తా #sochai అని పెట్టుకోస్తున్నారు. ఏదేమైనా ‘సామ్ చై’ లో ఉన్నంత సంతోషం ‘శోచై’ లో లేదురా అని కామెంట్స్ పెడుతున్నారు. శోచై అంటే శోభితా చైతన్య. ఆ పేరులో ఉన్న వైబ్రేషన్.. ఈ పేరులో లేదని పెదవి విరుస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. ఈ కొత్త జంట అయినా కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×