OTT Movie : పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్, తమిళ కమెడియన్ వడివేలు నటించిన ఒక థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఇద్దరి నటుల యాక్టింగ్ కి ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. నెగెటివ్ రోల్ లో ఫహాద్ ఫాజిల్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఈ తమిళ సినిమాలో దొంగ పాత్రలో ఫహాద్ ఫాజిల్, మతిమరుపు పాత్రలో వడివేలు నటించారు. ఒక సాధారణ రోడ్ ట్రిప్ తో మొదలయ్యే ఈ స్టోరీ, నడిచేకొద్దీ థ్రిల్లర్ వైబ్ ని ఇస్తుంది. ఈ సినిమా ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
నెట్‌ఫ్లిక్స్‌లో
‘మారీసన్’ (Maareesan) 2025లో విడుదలైన తమిళ థ్రిల్లర్ చిత్రం. దీనికి సుధీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఆర్. బి. చౌదరి సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, వడివేలు ప్రధాన పాత్రలలో నటించారు. సితారా, కోవై సరళ, వివేక్ ప్రసన్న, పి. ఎల్. తెనప్పన్, లివింగ్‌స్టన్ సహాయక పాత్రలలో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చగా, కలైసెల్వన్ శివాజీ సినిమాటోగ్రఫీ, శ్రీజిత్ సరంగ్ ఎడిటింగ్ చేశారు. ఈ చిత్రం 2025 జూలై 25న థియేటర్లలో విడుదలై, 2025 ఆగస్టు 22 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.
కథలోకి వెళ్తే
ఈ కథ ధయాళన్ (ఫహద్ ఫాసిల్) అనే దొంగ, వేలాయుధం పిళ్ళై (వడివేలు) అనే అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుడైన వృద్ధుడి చుట్టూ తిరుగుతుంది. ధయాళన్, ఇటీవల పాలయంకోట్టై జైలు నుండి విడుదలైన ఒక చిన్న దొంగ. మరోవైపు వేలాయుధంకి తన జ్ఞాపకశక్తి రాను రాను క్షీణిస్తుంటుంది. ఈ సమయంలో తన స్నేహితుడిని కలవడానికి తిరువన్నమలై బయలుదేరుతాడు. తిరువన్నమలై తీసుకెళ్తానని చెప్పి తన బైక్‌పై వేళయుధానికి లిఫ్ట్ ఇస్తాడు దయలాన్. ఈ జర్నీలో వేళాయుధం అకౌంట్‌లో పెద్ద మొత్తంలో డబ్బు ఉందని దయలాన్ కనిపెడతాడు. ఆ డబ్బును దోచుకోవాలని ప్లాన్ వేస్తాడు. ఈ ప్రయాణం ఒక మామూలుగా మొదలై, ఊహించని ట్విస్ట్‌లతో ఒక థ్రిల్లింగ్ జర్నీగా మారుతుంది.
సినిమా మొదటి భాగం ఒక లైట్-హార్టెడ్, ఫీల్-గుడ్ రోడ్ ట్రిప్‌గా ఉంటుంది. ఇక్కడ ధయాళన్, వేలాయుధం మధ్య ఒక అసాధారణ బంధం ఏర్పడుతుంది. ధయాళన్, తన ప్లాన్ లో భాగంగా, వేలాయుధం మతిమరుపుని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ వేలాయుధం అమాయకత్వంతో ఒక దశలో ఈ పని చెయ్యడానికి సంకోచిస్తాడు. పాత తమిళ పాటలు పాడుతూ, కమల్ హాసన్‌పై జోకులు వేస్తూ, రోడ్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తారు. అయితే ఇంటర్వెల్ సమయంలో ఒక షాకింగ్ ట్విస్ట్ కథను పూర్తిగా మార్చేస్తుంది.
వేలాయుధంకి సంబంధించిన రహస్యాలు బయటపడతాయి. ఈ సమయంలో వేలాయుధం, ధయాళన్ ఇద్దరూ ఒకరి గురించి ఒకరు మరింత తెలుసుకుంటారు. ఇది వారి జీవితాలను శాశ్వతంగా మార్చే ఒక ఎమోషనల్ బంధానికి దారితీస్తుంది. చివరికి ధయాళన్ ప్లాన్ ఏమవుతుంది ? వేలాయుధం గతం ఏమిటి ? ఈ సినిమాలో వచ్చే షాకింగ్ ట్విస్టులు ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : భర్త ఉండగానే మరొకడితో… వెంకటేష్ హీరోయిన్ ఇలాంటి రోల్ లో… ఫ్యామిలీతో చూడకూడని మూవీ