BigTV English

Tesla Sales: ఇండియాలో ఫస్ట్ టెస్లా కార్ ఓనర్ ఆయనే.. ఆ కారు ఫీచర్లు ఇవే

Tesla Sales: ఇండియాలో ఫస్ట్ టెస్లా కార్ ఓనర్ ఆయనే.. ఆ కారు ఫీచర్లు ఇవే

టెస్లా కంపెనీ ఇండియాలో తొలి అడుగు వేసింది. ఆ సంస్థకు చెందిన తొలి కారు ముంబైలో అమ్ముడయింది. ఇండియాలో ఫస్ట్ టెస్లా కార్ ఓనర్ గా మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్ నాయక్ కావడం విశేషం. ముంబైలో తొలి షోరూమ్ ని ఓపెన్ చేసిన టెస్లా కంపెనీ ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రికే తొలికారుని విక్రయించింది. తెలుపురంగు మోడల్ వై కారుని ఆయన కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ముంబైలోని టెస్లా ఎక్స్‌ పీరియెన్స్‌ సెంటర్‌ లో ఆ సంస్థ ప్రతినిధులు కారు తాళాలను యజమాని ప్రతాప్ సర్ నాయక్ కి అందజేశారు.


అందుకే కొనుగోలు చేశా..
పర్యావరణ హిత వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందుకే తాను ఈ కారుని కొనుగోలు చేశాని అన్నారు మంత్రి ప్రతాప్. టెస్లా కారు కొనుగోలు చేయడం ఆందంగా ఉందన్నారాయన. విద్యుత్‌ వాహనాలపై ఇప్పటికీ ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయని, వాటిని తొలగించేందుకు.. విద్యుత్ వాహనాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు తాను ఈ వాహనాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు.

మోడల్ వై..
భారత్ లో టెస్లా మోడల్ వై కార్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి మేడిన్ చైనా కార్లు. టెస్లా కంపెనీకి చెందిన కార్ల తయారీ ప్లాంట్ చైనాలోని షాంఘైలో ఉంది. అక్కడ తయారు చేసి, అక్కడే అసెంబుల్ చేసిన మోడల్ వై టెస్లా కార్ ని భారత్ కి తరలించి ఇక్కడ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం భారత్ లో మిడ్ రేంజ్ మోడల్స్ ని అందుబాటులోకి తెస్తున్నట్టు టెస్లా ప్రకటించింది. మోడల్ వై కూడా మిడ్ రేంజ్ ఎస్.యు.వి. రకానికి చెందినది. చైనా నుంచి భారత్ కి దిగుమతి చేసుకుని, దిగుమతి సుంకాలు, ఇతరత్రా స్థానిక సుంకాలు జతచేసి ఈ కారుని విక్రయిస్తోంది.

ఫీచర్లు..
ప్రస్తుతం రెండు వేరియంట్లలో ఈ కారు భారత్ లో అందుబాటులో ఉంది. రేర్‌-వీల్‌ డ్రైవ్‌ వేరియంట్‌ ధర రూ.59.89 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ మోడల్ ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 500 కి.మీ. నాన్ స్టాప్ గా ప్రయాణించవచ్చు. ఇంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునేవారు లాంగ్ రేంజ్ రేర్ వీల్ మోడల్ కి వెళ్లాల్సి ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.67.89 లక్షలు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 622 కి.మీ. నాన్ స్టాప్ గా ప్రయాణించవచ్చు. ఈ కార్ల కోసం ఇప్పటివరకు 600 బుకింగ్‌లు వచ్చాయని టెస్లా ప్రతినిధులు చెబుతున్నారు. అయితే తొలికారుని మాత్రం వారు రవాణా శాఖ మంత్రికి విక్రయించారు.

రేట్లు తగ్గుతాయా..?
భారత్ లో ఇటీవల దీపావళి బొనాంజా అంటూ జీఎస్టీ తగ్గింపుల్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో విద్యుత్ వాహనాలకు కూడా రిబేటు ప్రకటించింది. మరికొన్నిరోజులు ఆగితే విద్యుత్ వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఒరవడిలో టెస్లా కార్ల రేట్లు కూడా భారత్ లో తగ్గే అవకాశం ఉంది.

Related News

రిటైర్ అయ్యాక ప్రతి నెలా 1 లక్ష రూపాయల పెన్షన్ కావాలా..అయితే ఇలా ఇన్వెస్ట్ చేయండి..?

BSNL Offer: 72 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా.. BSNL నుంచి మరో అదిరిపోయే ప్లాన్!

Today Gold Price: తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు..

Flipkart Offer: ఎంత షాపింగ్ చేసినా సేవింగ్స్ గ్యారెంటీ.. ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్

Jio Special Offers: ఫ్రీ డేటా.. OTT యాక్సెస్.. జియో బర్త్ డే గిఫ్ట్ అదిరిందిగా!

Big Stories

×