OTT Movie : ఓటీటీలోకి అన్ని భాషల సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. కంటెంట్ బాగుంటే భాషను కూడా పక్కకు పెడుతున్నారు. కొంచెం నచ్చినా చాలు ఇక వదలకుండా చూసేస్తున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో ఒక తమిళ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తోంది. ఇందులో తంగపొన్ను అనే వృద్ధురాలు చనిపోయాక, ఆమె బంగారు కమ్మల గురించి ఒక చిన్నపాటి యుద్దమే జరుగుతుంది. ఈ స్టోరీ కుటుంబ డైనమిక్స్ తో గుండెను పిండే ఒక ఎమోషనల్ టచ్ ని ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
సుబ్రమణి పది రోజుల్లో రిటైర్మెంట్ అవ్వబోతున్న ఒక నిజాయితీ పోలీస్ కానిస్టేబుల్. ఇతనికి తొందరపాటు, కోపం కూడా ఎక్కువే. దీని వల్ల ఉన్నతాధికారుల కోపాన్నికూడా అప్పుడప్పుడు రుచి చూస్తుంటాడు. ఒక రోజు కిడారిపట్టి అనే గ్రామంలో, సెల్వరాసు అనే యువకుడు తన అమ్మమ్మ తంగపొన్ను కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తాడు. ఆ గ్రామం ఎప్పుడూ అందరితో జగడాలు పెట్టుకుంటూ ఉంటుంది. అందుకే అధికారులు ఈ కేసు తీసుకోవడానికి ఆసక్తి చూపరు. కానీ ఈ కేసును తీసుకోవడానికి సుబ్రమణి ముందుకొస్తాడు. అతను తంగపొన్నును రోడ్డు పక్కన కొనఊపిరి స్థితిలో చూసి ఆసుపత్రిలో చేర్పిస్తాడు. కానీ ఆమె చనిపోతుంది. సెల్వరాసు, అమ్మమ్మ అంత్యక్రియలు శాంతియుతంగా జరగాలని సుబ్రమణిని గ్రామానికి రమ్మని కోరతాడు. అక్కడ తంగపొన్ను ముగ్గురు కుమార్తెలు, మద్యపానం అలవాటు ఎక్కువగా ఉండే కొడుకు షోపండి, సెల్వరాసు తల్లి, ఆమె బంగారు పెద్ద కమ్మలు కోసం ఆశపడుతుంటారు. ఇది తంగపొన్ను చాలా ప్రేమగా చూసుకునే ఆభరణం.
అయితే రాత్రి ఈ బంగారు కమ్మలు ఉన్నట్టుండి అదృశ్యమవుతాయి. దీంతో ఈ కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. సుబ్రమణి కమ్మలు దొంగతనం కేసును ఛేదించడానికి, అంత్యక్రియలను సజావుగా జరిపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గందరగోళం సృష్టిస్తారు. ఇక్కడ ఫ్లాష్‌బ్యాక్‌లో తంగపొన్ను లవ్ స్టోరీ రివీల్ అవుతుంది. ఇందులో బంగారు కమ్మల గురించి ఒక ఎమోషనల్ డ్రామా నడుస్తుంది. ఈ క్లైమాక్స్ లో వచ్చే ఊహించని ట్విస్ట్ పేక్షకుల హార్ట్ ని పిండుతుంది. ఇంతకీ బంగారు కమ్మల దొంగ ఎవరు ? తంగపొన్ను గతం ఏమిటి ? సుబ్రమణి ఈ కేసును ఎలా డీల్ చేస్తాడు ? ఈ స్టోరీ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
‘Thandatti’ అనేది రామ్ సంగయ్య దర్శకత్వం వహించిన తమిళ కామెడీ మిస్టరీ సినిమా. ఇది అతని తొలి దర్శకత్వ చిత్రం. ఈ కథను ఇందులో పశుపతి, రోహిణి, వివేక్ ప్రసన్న, అమ్ము అభిరామి, దీపా శంకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 జూన్ 23 థియేటర్లలో విడుదలై, 2023 జూలై 14 నుంచి Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల 3 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 6.7/10 రేటింగ్ పొందింది.
Read Also : టీచర్ కు పాఠాలు నేర్పించే 17 ఏళ్ల కుర్రాడు… ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ ఎమోషనల్ డ్రామా