Big Stories

Central Govt Alert To Apple Users: యాపిల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ‘హై రిస్క్’ ఉందంటూ కేంద్ర హెచ్చరికలు జారీ

- Advertisement -

Central Govt Alert To Apple Users: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ వస్తువుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా భారతదేశంలో యాపిల్ వస్తువుల క్రేజ్ మామూలుగా లేదు. ఈ తరుణంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం యాపిల్ యూజర్లకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. హైరిస్క్ అలర్ట్ పేరిట బుధవారం భద్రతాపరమైన హెచ్చరికలు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

- Advertisement -

యాపిల్ వస్తువుల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. ‘రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్’కు సంబంధించిన సెక్యూరిటఅ లోపాలను గుర్తించినట్లు సీఈఆర్టీ ఇన్ స్పష్టం చేసింది. ఈ మేరకు పలు యాపిల్ వస్తువుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో ఉన్న యాపిల్ వస్తువుల్లో.. ఐఫోన్ కూడా ఉన్నట్లు పేర్కొంది.

యాపిల్ వస్తువుల్లో ఉన్న ఈ లోపాల కారణంగా హ్యాకర్లు కోడ్ ను ఎగ్జిక్యూట్ చేసి మన డివైజ్ లను ఆపరేట్ చేసే ఛాన్స్ ఉందని.. అదే కనుక జరిగితే దేశానికి భారీ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఈ తరుణంలో యూజర్లు తమ యాపిల్ వస్తువుల్లో వెంటనే లేటెస్ట్ వెర్షన్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. ఇందులో ముఖ్యంగా ఐఫోన్, ఐప్యాడ్స్, విజన్ ప్రో హెడ్ సెట్లకు హై రిస్క్ ఉన్నట్లు తెలిపింది.

Also Read: మీకు డ్రైవింగ్ రాదా.. ఏం పర్లేదు.. ఈ స్కూటీనే మిమ్మల్ని తీసుకెళ్తుంది

ఈ వెర్షన్లలో లోపాలు..

ఐఓఎస్

ఐ ప్యాడ్ ఓఎస్ 17.4.1, 16.7.7

సఫారీ 17.4.1

మ్యాక్ఓఎస్ వెంట్యురా 13.6.6

మ్యాక్ఓఎస్ సొనోమా 14.4.1

యాపిల్ విజన్ ఓఎస్ 1.1.1

ఐఫోన్ ఎక్స్ఎస్

ఐ ప్యాడ్ ప్రో 12.9, 10.5, 11 ఇంచ్

ఐప్యాడ్ ఎయిర్

ఐప్యాడ్ మినీ

ఇవే కాకుండా దీని కంటే ముందు ఉన్న వెర్షన్లలో కూడా లోపాలు ఉన్నట్లు గుర్తించామని సెర్ట్ ఇన్ స్పష్టం చేసింది. వీటితో పాటు ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్, ఐప్యాడ్ 5 జెనరేషన్ వంటి యూజర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని.. వీరు కూడా హ్యాకింగ్ బారిన పడే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించింది. ఇప్పటికే ఒకసారి సెర్ట్ ఇన్ యాపిల్ వస్తువులకు అలర్ట్ జారీ చేయగా.. తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేయడం భయాందోళనకు గురిచేస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News