BigTV English

Ather 450 Apex Price Increased: ఏథర్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన 450 Apex ప్రైస్!

Ather 450 Apex Price Increased: ఏథర్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన 450 Apex ప్రైస్!

Ather 450 Apex Price Increased: ఏథర్ 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్  చెప్పింది. ఈ ఏడాది జనవరిలో కంపెనీ దీన్ని ప్రారంభించింది. దీని ప్రారంభ ధర రూ.1.89 లక్షలు. ఇప్పుడు కంపెనీ దాని ధరను రూ.6,000 పెంచింది. దీంతో దాని కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.95 లక్షలుగా మారింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 450 అపెక్స్ అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఓలా ఎలక్ట్రిక్ S1 ప్రోతో పోటీపడుతుంది.


450 అపెక్స్ కంపెనీ అత్యంత పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది 7kW ఎలక్ట్రిక్ మోటార్, 3.7kWh బ్యాటరీని కలిగి ఉంది. ఈ సెటప్ 210Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది 2.9 సెకన్లలో గంటకు 0-100 కిమీ వేగాన్ని అందుకుటుంది. దీని గరిష్ట వేగం గంటకు 100 కిమీ. ఇది ఏథర్ 450X కంటే 10 కిమీ వేగాన్ని ఇస్తుంది. దీని కొత్త వార్ప్+ రైడ్ మోడ్ ఈ ఇ-స్కూటర్ బెస్ట్ ఫర్ఫామెన్స్ ఇస్తుంది.

Also Read: 333కిమీ రేంజ్‌తో MG నుంచి బుజ్జి EV.. మార్కెట్ షేక్ కావడం పక్కా!


ఏథర్ 450 అపెక్స్‌లో స్ట్రాంగ్ అడ్జస్ట్‌బుల్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. అథర్ దీనికి మ్యాజిక్ ట్విస్ట్ అని పేరు పెట్టారు. థొరెటల్‌ను వెనుకకు తిప్పినప్పుడు స్కూటర్ వేగం పెరుగుతుంది. కానీ దానిని ముందుకు తిప్పినప్పుడు అది బ్రేకింగ్ కోసం పనిచేస్తుంది. ఏథర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 157కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

దాని డిజైన్ గురించి మాట్లాడితే ఇది ఇంతకముందు వచ్చిన మోడల్ మాదిరిగానే ఉంటుంది. దీనికి శాటిన్ ఫీల్, రెడ్ ఫ్లెక్స్‌తో ప్రత్యేకమైన బ్లూ, స్టార్క్ ఆరెంజ్‌తో కొత్త కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. Ather 450 Apex 7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, గూగుల్ మ్యాప్స్‌తో నావిగేషన్, LED లైటింగ్, పార్క్ అసిస్ట్, ఆటో హోల్డ్, అల్యూమినియం స్పేస్ ఫ్రేమ్ ఛాసిస్, అల్లాయ్ వీల్స్‌తో పాటు అనేక ఇతర ఫీచర్లను కూడా ఉన్నాయి.

Also Read: రికార్డులు బ్లాస్ట్.. ఫస్ట్‌ప్లేస్‌లోకి కొత్త స్విఫ్ట్.. లెక్కలు ఇవే!

హార్డ్‌వేర్ విషయానికొస్తే స్కూటర్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్, మోనోషాక్ ఉన్నాయి, బ్రేకింగ్ కోసం 200ఎమ్ఎమ్ ఫ్రంట్ డిస్క్,190ఎమ్ఎమ్ రియర్ డిస్క్ చూడొచ్చు. రూ. 1.95 లక్షలతో ఏథర్ 450 అపెక్స్ చాలా ఖరీదైన స్కూటర్. Ather 450 Apex కంటే చౌకైన Ola S1 ప్రో స్కూటర్ రూ. 1.30 లక్షలు ఎక్స్-షోరూమ్‌కు లభిస్తుంది.

Tags

Related News

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Big Stories

×