BigTV English

MG Gloster Facelift: MG మోటార్స్ నుంచి కొత్త SUV.. జూన్ 5న లాంచ్!

MG Gloster Facelift: MG మోటార్స్ నుంచి కొత్త SUV.. జూన్ 5న లాంచ్!

MG Gloster Facelift: బ్రిటిష్ వాహన తయారీ సంస్థ MG మోటార్స్ ఎలక్ట్రిక్ నుండి ఫుల్ సైజ్ SUV సెగ్మెంట్ వరకు అనేక వాహనాలను భారతీయ మార్కెట్‌లో అందిస్తోంది. టయోటా ఫార్చ్యూనర్‌‌కు పోటీ ఇచ్చేందుకు కంపెనీ గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఇందులో ఎలాంటి మార్పులు చేయనున్నారు? ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు? తదితర వివరాలు తెలుసుకోండి.


MG గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్‌ను కంపెనీ పూర్తి స్థాయి SUVగా తీసుకురానుంది.  గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ జూన్ 2024 జూన్ 5న లాంచ్ కానుందని కంపెనీ సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేసింది. MG గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభించడానికి ముందు టీజర్‌ను విడుదల చేశారు. కంపెనీ సోషల్ మీడియాలో 15 సెకన్ల టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ గ్లింప్స్ చూడొచ్చు. టీజ‌ర్‌లో గ్లాస్ బాటిల్‌పై నుంచి ఇసుక పడుతూ ఉంటుంది. దీనిలో గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ ఓవర్ వ్యూ చూడవచ్చు. దీనితో పాటు కొత్త MG గ్లోస్టర్ మూడు రోజుల తర్వాత విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Also Read: మారుతీ, స్కోడా, హోండా నుంచి రానున్న కార్లు ఇవే!


దీనికి సంబంధించి కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అందించలేదు. అయితే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కంపెనీ బంపర్, గ్రిల్, హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్, అల్లాయ్ వీల్స్ వంటి SUV బయట భాగంలో మార్పులు చేయవచ్చు. ఇంటీరియర్‌లో కూడా ఈ SUVకి అనేక మార్పులతో పాటు కొన్ని కొత్త ఫీచర్లను అందించవచ్చు. కానీ ఇంజన్, ట్రాన్స్‌మిషన్‌లో ఏదైనా మార్పు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

Also Read: బెస్ట్ ఆఫర్.. హోండా ఎలివేట్‌పై వేలల్లో డిస్కౌంట్!

SUV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కొన్ని కొత్త కలర్ వేరియంట్లు కూడా ఉంటాయి. ఇందులో డెస్టర్ స్టార్మ్ పెయింట్ స్కీమ్ కూడా ఉంటుంది. గ్లోస్టర్‌ను బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ MG భారతీయ మార్కెట్‌లో ఫుల్ సైజ్ SUV విభాగంలో తీసుకురానుంది. కంపెనీ ఈ SUV ఏడు సీట్ల ఆప్షన్‌తో తీసుకురావచ్చు. లాంచ్ చేయడానికి ముందు ఈ SUV రోడ్లపై టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది.

Tags

Related News

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Personal Finance: 45 సంవత్సరాలకే రిటైరయ్యి పెన్షన్ పొందుతూ లైఫ్ హాయిగా గడపాలని ఉందా..అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..

Big Stories

×