BigTV English

Force 5 Door Gurkha: ఫోర్స్ మోటర్స్ నుంచి ఐదు డోర్ల SUV.. ఇక వాటికి చుక్కలే!

Force 5 Door Gurkha: ఫోర్స్ మోటర్స్ నుంచి ఐదు డోర్ల SUV.. ఇక వాటికి చుక్కలే!

Force 5 Door Gurkha: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీల క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. ఎస్‌యూవీలను కొనుగోలు చేసేందుకు కారు లవర్స్ ఇంటరెస్ట్ చూపుతున్నారు. అమ్ముడుపోతున్న రెండు కార్లలో ఒకటి ఎస్‌యూవీ సెగ్మెంట్ వెహికల్ ఉంటుంది. అందుకే ఈ ఎస్‌యూవీల డిమాండ్ భారీగా ఉంది.  దీంతో దిగ్గజ కంపెనీ ఫోర్స్ మోటర్స్ దేశంలో ఐదు డోర్ల ఎస్‌యూవీ గుర్జాను లాంచ్ చేసింది. ఇందులో పవర్ ఫుల్ ఇంజన్ తీసుకొచ్చారు. ఈ వాహనానికి పొడవైన వీల్‌బేస్‌కు అందించారు. ఈ SUV లో కంపెనీ ఎలాంటి మార్పులు చేసింది? ఎటువంటి ఫీచర్లు తీసుకొచ్చారు? తదితర విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.


ఫోర్స్ గూర్ఖా 5 డోర్ వేరియంట్‌ను దేశీయ మార్కెట్‌లో కంపెనీ విడుదల చేసింది. గుర్జా ఫైవ్-డోర్ వీల్‌బేస్ 425 మిమీ వరకు పొడవు ఉంటుంది. గూర్ఖా వీల్‌బేస్ 2400 మిమీ కాగా, ఐదు డోర్ల గూర్ఖా వీల్‌బేస్ 2825 మిమీ. ఇది రూఫ్ క్యారియర్‌తో 2296 మిమీ పొడవు, రూఫ్ క్యారియర్ లేకుండా దాని ఎత్తు 2095 మిమీ. ఇప్పుడు ఈ ఐదు డోర్ల SUVలో ఏడుగురు ప్రయాణికులు కలిసి ప్రయాణించవచ్చు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 233 మిమీ.

Also Read: ఈ రెండు స్కూటర్లలో ఏది బెస్ట్? ఏది కొనాలి?


ఫోర్స్ గుర్జా 5 డోర్ వేరియంట్‌లో కంపెనీ దీనికి ఐకానిక్ LED హెడ్‌ల్యాంప్‌లను అందించింది. ఇది కాకుండా 18 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, లాడర్ పైకప్పు యాక్సెస్, కొత్త అప్హోల్స్టరీ, రెండవ వరుస బెంచ్ సీటు, మూడవ వరుస కెప్టెన్ సీటు, తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, మాన్యువల్ AC, రూఫ్ AC వెంట్, పవర్ విండోస్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ కెమెరా, ABS, TPMS వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. SUV గ్రీన్,రెడ్, వైట్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఈ కొత్త SUVలో కంపెనీ 2.6 లీటర్ నాలుగు-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను అందించారు. ఈ ఇంజన్ నుండి SUV 140 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ రిలీజ్ చేస్తుంది. SUVలో స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది ఐదు-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. దీంతో పాటు 4×4 కూడా ఇందులో ఇస్తున్నారు.

Also Read: టాటా కొత్త ఎలక్ట్రిక్ SUV.. సింగిల్ ఛార్జ్‌తో హైదరాబాద్ టూ బెంగళూరు వెళ్లొచ్చు!

ఈ SUVని కంపెనీ తాజాగా పరిచయం చేసింది. కొంతకాలం తర్వాత ఇది అధికారికంగా భారత మార్కెట్లో లాంచ్ చేయబడుతుంది. అప్పుడే ఈ SUV ధర సమాచారాన్ని కంపెనీ తెలియజేస్తుంది. ప్రస్తుతం, ఐదు డోర్ల గూర్ఖా నేరుగా మారుతి జిమ్నీతో పోటీ పడనుంది.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×