BigTV English

Ruturaj Gaikwad on Ravindra Jadeja: రవీంద్ర జడేజా.. మ్యాచ్ విన్నర్: రుతురాజ్

Ruturaj Gaikwad on Ravindra Jadeja: రవీంద్ర జడేజా.. మ్యాచ్ విన్నర్: రుతురాజ్
Ruturaj Gaikwad Hails Ravindra Jadeja’s ‘Match-Turning Spell’ Against Sunrisers: చెన్నయ్ సూపర్ కింగ్స్ మళ్లీ పట్టాలెక్కింది. ధనాధన్ ఆడే హైదరాబాద్ ని సమర్థవంతంగా నిలువరించింది. అతి తక్కువ స్కోరుకి ఆపగలిగింది. అంతేకాదు కెప్టెన్ రుతురాజ్ 2 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా రుతురాజ్ మాట్లాడుతూ సెంచరీ మిస్ అయినందుకు బాధ లేదు. జట్టు గెలిచినందుకు ఒక కెప్టెన్ గా చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న సందర్భంగా మాట్లాడాడు.

నిజానికి మ్యాచ్ విన్నర్ ఎవరంటే రవీంద్ర జడేజా అని చెప్పాడు. ఒకవైపున తేమపై బాల్ జారిపోతున్నా సరే,  ఎంతో కష్టంగా బాల్ ని పిచ్ పై నిలువరించాడని అన్నాడు. దీనివల్ల తను 4 ఓవర్లలో కేవలం 22


పరుగులు మాత్రమే ఇచ్చాడని తెలిపాడు. ఇదే మ్యాచ్ టర్నింగ్  అని చెప్పాడు. తనే మాత్రం లూజ్ బాల్స్ వేసినా, మ్యాచ్ మా కంట్రోల్ తప్పేదని అన్నాడు.

Also Read: హైదరాబాద్ వర్సెస్ సీఎస్కే మ్యాచ్ వింతలు, విశేషాలు


అది కూడా మిడిల్ ఓవర్స్ లో నియంత్రించడం వల్ల, తర్వాత వచ్చేవారిపై ప్రెజర్ పెరిగి, రాంగ్ షాట్లు ఆడి అవుట్ అయ్యారని చెప్పుకొచ్చాడు. ఏదైనా సీనియర్లు సీనియర్లే అన్నాడు. వారి అనుభవం ఇలాంటి సమయంలో ఉపయోగపడుతుందని తెలిపాడు.

ఇంకా మాట్లాడుతూ తేమ ప్రభావం ఎక్కువగా ఉన్న ఇలాంటి మ్యాచ్ ల్లో ఆడటం చాలా కష్టమని అన్నాడు. టాస్ ఓడిపోవడం మాకు కలిసొచ్చిందని అన్నాడు. లేదంటే మేం కూడా ఫస్ట్ బ్యాటింగ్ హైదరాబాద్ కి ఇచ్చేవాళ్లమని అన్నాడు. నా సెంచరీ అయ్యేదే, కానీ నాలుగైదు షాట్లు సరిగ్గా కనెక్ట్ కాలేదు. దాంతో అవి ఫోర్లు, సిక్సులుగా మారలేదని అన్నాడు. ఫీల్డింగ్ చాలా మెరుగుపడిందని అన్నాడు. తుషార్ బౌలింగ్ అద్భుతమని తెలిపాడు.

అయితే ఓడిన హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ మ్యాచ్ తర్వాత మాట్లాడాడు. చెన్నయ్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారని తెలిపాడు. నిజానికి మా టాప్ ఆర్డర్ బలంతో 210 ప్లస్ స్కోరుని ఈజీగా సాధించగలమని భావించానని తెలిపాడు. అయితే పిచ్ టర్న్ కావడంతో బ్యాటర్ల అంచనాలకు భిన్నంగా బాల్ ల్యాండ్ అయ్యిందని, దీంతో షాట్లు కనెక్ట్ అవలేదు. అందుకే 9 క్యాచ్ అవుట్లు అయినట్టు తెలిపాడు. తప్పకుండా తదుపరి మ్యాచ్ ల్లో పుంజుకుని రేస్ లోకి వెళతామని అన్నాడు.

Tags

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×