BigTV English

India’s Slowest Train: 46 కి.మీ దూరం.. 5 గంటల ప్రయాణం, ఈ రైలు ఎంత నెమ్మదిగా వెళ్లినా మీకు విసుగురాదు.. ఎందుకంటే?

India’s Slowest Train: 46 కి.మీ దూరం.. 5 గంటల ప్రయాణం, ఈ రైలు ఎంత నెమ్మదిగా వెళ్లినా మీకు విసుగురాదు.. ఎందుకంటే?

Nilgiri Mountain Railway: సాధారణంగా 50 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు గంట సమయం పడుతుంది. రైల్లో అయితే.. అంతకంటే తక్కువ టైమే పడుతుంది. కానీ, ఆ రైలు మాత్రం 46 కిమీలు ప్రయాణించడానికి 5 గంటల సమయం తీసుకుంటుంది. అయితే, అది ఆగి ఆగి వెళ్తుందని అనుకొంటే పొరపాటే. దాని నడకే నెమ్మది. అయితే, ఆ మార్గంలో వెళ్తుంటే.. మీకు అస్సలు విసుగురాదు. పైగా మీకు ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మరి, దేశంలోనే అత్యంత నెమ్మదిగా ప్రయాణించే ఆ రైలు గురించి తెలుసుకుందామా. 


తమిళనాడులో ప్రకృతి అందాలకు నెలవైన ప్రదేశం నీలగిరి. ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రాంతంలో ప్రత్యేక రైలు మార్గం ఉంది. నీలగిరిని సందర్శించే పర్యాటకులకు నీలగిరి మౌంటైన్ రైల్వే మరుపురాని అనుభూతిని కలిగిస్తుంది. మెట్టపాళయం నుంచి ఊటీ వరకు ఉన్న అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూడాలి అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ ఈ రైలు. ఆసియాలో ర్యాక్, పినియన్ ట్రాక్‌లపై నడి ఏకైక రైలు కూడా ఇదే. ఈ ట్రైన్ పర్వతాల ప్రాంతాల మీదుగా 16 సొరంగాలు, 250 వంతెనలను దాటుతూ వెళ్తుంది. ప్రతి ఏటా ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు లక్షలాదిగా పర్యాటకులు తరలి వస్తారు. నీలగిరి రైలులో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను చూసిన ఎంజాయ్ చేస్తారు.

తొలుత ఎద్దుల బండ్ల ప్రయాణం


1830వ దశకంలో  ప్రయాణికులు మెట్టుపాళయం నుంచి ఊటీకి ఎద్దుల బండిలో ప్రయాణించేవారు. 1872 నాటికి గుర్రపు బండ్లు అందుబాటులోకి వచ్చాయి. ఆ సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీని బ్రిటీష్ వాళ్లు పాలించారు. తెల్లదొరలు నీలగిరి సహజ సౌందర్యం, చల్లని వాతావరణానికి మంత్రముగ్దులు అయ్యారు. నీలగిరిని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రంగా మార్చుకున్నారు.

1899లో తొలి రైలు ప్రయాణం

ప్రకృతి అందాలకు నెలవైన నీలగిరిలో రైలు సర్వీసు ఏర్పాటు చేయాలని ఆంగ్లేయులు భావించారు. 1890లో కూనూర్ వరకు ర్యాక్, పినియన్ ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. ఆవిరితో నడిచే రైలు 1899లో ఈ ట్రాక్ పై తన తొలిసారి ప్రయాణం చేసింది. అప్పుడు ప్రారంభం అయిన రైలు సర్వీసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పశ్చిమ కనుమల అందాలను తిలకించే పర్యటకులను సాదరంగా ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం మెట్టుపాళయం- ఊటీ మధ్య 46.61 కి.మీ.ల రైలు మార్గం ఉంది.  నిజానికి బ్రిటీష్ కాలంలో ఆవిరి ఇంజిన్‌తో నడిచే ఈ రైలు, అప్పటి అవసరాలకు అనుగుణంగా సరికొత్త సౌకర్యాలతో నవీకరించబడింది. 125 సంవత్సరాలుగా ఇదే పద్దతిలో రైలు జర్నీ కొనసాగుతోంది. అత్యంత ఆకర్షణీయమైన ప్రయాణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆహ్లాదపరుస్తుంది.

అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలు

నీలగిరి మౌంటైన్ రైలు దేశంలోనే అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది గంటకు కేవలం 9 కిలో మీటర్ల వేగంతో నడుస్తుంది. మెట్టుపాళయం నుంచి ఊటీకి 46 కి.మీ దూరాన్ని చేరుకోవడానికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది. ఊటీ నుంచి మెట్టుపాళయం వరకు తిరుగు ప్రయాణం దాదాపు 3 గంటల 30 నిమిషాల్లో పూర్తవుతుంది.

చయ్యా చయ్యా పాట చిత్రీకరణ ఇక్కడే..

నీలగిరి మౌంటైన్ ఎక్స్‌ ప్రెస్ గా పిలువబడే ఈ రైలు మెట్టుపాళయం నుంచి ఊటీకి జర్నీ చేస్తుంది. కల్లార్, కూనూర్, వెల్లింగ్టన్, వాల్డెన్ మీదుగా ప్రయాణిస్తుంది. ఈ మౌంటైన్ పర్వత రైలు ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందింది. ‘దిల్ సే’ చిత్రంలోని ‘చయ్యా చయ్యా’ పాటను ఈ అందమైన మౌంటైన్ రైల్లోనే షూట్ చేయడం విశేషం.

Read Also: ఇంజిన్ ఒక రాష్ట్రంలో.. బోగీలు మరో రాష్ట్రంలో.. భారత్ లో పేరులేని రైల్వే స్టేషన్ గురించి మీరెప్పుడైనా విన్నారా?

Related News

WhatsApp: ఒకే ఫోన్‌లో 2 వాట్సప్ అకౌంట్లు.. లాగ్అవుట్ లేకుండా వాడే కొత్త ట్రిక్..

Amazon Great Indian Festival: బ్రాండెడ్ ఫ్రిజ్‌లపై 55 శాతం తగ్గింపు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ ఆఫర్స్

Flipkart SBI Offers: ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఇన్ని లాభాలా?

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Big Stories

×