Car Mileage Test : కారు కొనడం అనేది ప్రతి మిడిల్ క్లాస్ ప్రజల డ్రీమ్. కొందరు మిడిల్ క్లాస్ ప్రజలు కారులో ప్రయాణం ఓ అదృష్టంగా భావిస్తారు. ఇటువంటి ప్రజలు కారు కొనే ఆలోచనలు ఉన్నా వాటి మైలేజ్ ఆ కోరికను చంపేస్తుంది. అయినప్పటికీ మనలో చాలా మంది కారు కొనుగోలు చేసేందుకు ధైర్యం చేస్తాయి.
ఇలాంటప్పుడు వారు ముందుగా అడిగే ప్రశ్న ‘ఇది ఎంత ఇస్తుంది?’. ఇది ARAIచే గుర్తింపు పొందిదా లేదని మరో ప్రశ్న వేస్తారు. ఈ ప్రశ్నలన్నీటికి కారణం మైలేజ్. లీటర్‌కు ఎంత మైలేజ్ ఇస్తుందో.. దాన్ని బట్టి వెహికల్‌ను తీసుకుంటారు. అయితే కారు నిజమైన మైలేజ్‌ను తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని చూడండి.
Also Read : రూ. 10 లక్షల్లో బెస్ట్ మైలేజ్ కార్లు ఇవే!
ట్యాంక్ నింపండి
కారు మైలేజీని పరీక్షించడానికి.. ముందుగా దాని ట్యాంక్‌ను నింపండి. ట్యాంక్ నింపేటప్పుడు ఇంధనం అంచుకు చేరుకుందో లేదో గుర్తించండి. ఎందుకంటే ఆటో కట్ సిస్టమ్ వేర్వేరు నాజిల్‌ల ప్రకారం మారుతుంది. ట్యాంక్‌లోని మొత్తం ఇంధనాన్ని ట్రాక్ చేయండి .
ట్రిప్ రీసెట్ చేయండి
ట్యాంక్ నిండిన తర్వాత మీరు కారు లోపలికి రావాలి. ఇంధన ట్యాంక్ అంచుకు నిండిన తర్వాత. వాహనం యొక్క ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లోని ట్రిప్ మీటర్‌ను జీరోకి రీసెట్ చేయండి.
డ్రైవ్ చేయండి
ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా నింపి.. ట్రిప్ మీటర్‌ని రీసెట్ చేసిన తర్వాత డ్రైవింగ్ ప్రారంభించండి. ఇంధనం నింపుకునే ముందు కనీసం 250-300 కిమీ డ్రైవింగ్ చేయడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందుతారు. వేగంపై, రహదారిపై శ్రద్ధ వహించండి
మీ 250-300 కి.మీ డ్రైవ్ సమయంలో మీ కారును ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నడిపే ప్రయత్నం చేయండి. దీనితో పాటు పరిమితమైన వేగంలో నడపండి.
Also Read : ఈ 10 కార్లతో మీ ప్రయాణం సేఫ్.. ఎందుకంటే?
మైలేజీని లెక్కించండి
ట్రిప్ పూర్తయిన తర్వాత.. వాహనాన్ని గతంలో ఇంధనం నింపిన అదే ఇంధన స్టేషన్‌కు తీసుకురావడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఇక్కడకు వచ్చి అదే నాజిల్‌తో అంచు వరకు ఇంధన ట్యాంక్‌ను నింపండి. నింపిన ఇంధనం మొత్తాన్ని గమనించండి. ఇలా మైలేజీని సులభంగా లెక్కించండి.