
Boxer Vijender Singh Joins BJP(Political news telugu): సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బాక్సింగ్‌లో భారతదేశ మొట్టమొదటి ఒలింపిక్ పతక విజేత, కాంగ్రెస్ నాయకుడు విజేందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు.
విజేందర్ సింగ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ నేత రమేశ్ బిధూరీ చేతిలో ఓటమిపాలయ్యారు.
విజేందర్ సింగ్ జాట్ కమ్యూనిటీ నుంచి వచ్చారు, ఇది అతని సొంత రాష్ట్రమైన హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో పెద్ద సంఖ్యలో ప్రభావం చూపనుంది.
కాగా బీజేపీ ఎంపీ హేమమాలిని పోటీ చేస్తున్న మథుర నియోజకవర్గం నుంచి విజేందర్ సింగ్‌ను బరిలో దించే అవకాశాలున్నాయని వార్తలు చెక్కర్లు కొట్టాయి.