Today Gold Price: అక్షయ తృతీయ వేళ.. మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,750 చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,910 వద్ద కొనసాగుతోంది.
అక్షయ తృతీయ సందర్భంగా వినియోగదారులు బంగారం షాపులకు తరలివెళ్తున్నారు. ఇక పండుగ రోజు గోల్డ్ కొనుగోలు చేస్తే అదృష్టంగా భావిస్తారు. గత కొద్ది రోజులుగా పసిడి ధర పెరిగి లక్ష రూపాయలు మార్కు చేరడంతో.. కొందరు కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా పలు షాపులు డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు. బంగారం రేట్లు రికార్డు స్థాయిలో పెరగడంతో కస్టమర్లు సెంటిమెంట్‌ను పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది.
అయితే కొందరు మాత్రం 24 క్యారేట్ల గ్రాము బంగారం 8900 రేటు పలుకుతున్నా.. ఏమాత్రం వెనక్కి తగ్గేదేలే అంటూ. ఇంట్లో పూజలు చేసుకుని బంగారం కొనేందుకు జ్యూయలరీ షాపులకు వస్తున్నారు. గతంతో పోల్చితే అమ్మకాలు ఆ స్థాయిలో లేవని వ్యాపారులు చెబుతున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌ను స్థిరంగా ప్రారంభించాయి. గ్లోబల్‌గా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రారంభంలో స్థిరంగా ప్రారంభమైన సూచీలు తర్వాత నెగటివ్ వైపుకు జారుకున్నాయి.
ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 66 పాయింట్ల నష్టంతో 80,204 స్థాయిలో ట్రేడవుతుండగా, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 24,305 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌కు చెందిన 30 షేర్లలో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్,ఇండస్‌ఇండ్ బ్యాంక్,టాటా, మోటార్స్, ఎస్‌బీఐ, ఎటర్నల్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
బంగారం ధరలు ఇలా
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,750 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 910 పలుకుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,750 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 910 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,750 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 910 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,900 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 040 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,750 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 910 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,750 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 910 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: ఒకే రీచార్జ్ ఏడాది మొత్తం ఫ్రీడమ్..720జీబీ డేటాతోపాటు కాలింగ్ కూడా..
వెండి ధరలు ఇలా..
అక్షయ తృతీయ సందర్భంగా.. వెండి ధరలు దిగొచ్చాయి.
ఈరోజు(ఫిబ్రవరి 30)న వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్ లో కిలో వెండి ధర రూ.1,09,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,00,400 వద్ద కొనసాగుతోంది.