BigTV English

Human Thumb Parcel: రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం.. బిజినెస్‌మెన్ ఇంటికి మానవ బొటన వేలు పార్సిల్..

Human Thumb Parcel: రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం.. బిజినెస్‌మెన్ ఇంటికి మానవ బొటన వేలు పార్సిల్..

Human Thumb Parcel| త్వరగా డబ్బులు సంపాదించడానికి కొందరు తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా వ్యసనాలకు బానిసైన టీనేజర్లు, యువత నేరగాళ్లుగా మారుతున్నారు. తాజాగా అలాంటి ఒక కేసు తూర్పు ఢిల్లీలో జరిగింది. ఒక బడా వ్యాపార వేత్త ఇంటికి మానవ అవయవం పార్సిల్ చేసి కొందరు దుండగులు బెదిరించారు. పైగా ఒక మంచి కార్యం కోసం రూ.5 కోట్లు చెల్లించాలని బ్లాక్ మెయిల్ చేశారు. లేకపోతే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. తూర్పు ఢిల్లీ లోని షషదారాకు చెందిన వ్యాపావేత్త వికాస్ జైన్ ఇంటికి ఏప్రిల్ 16 2025న ఒక పార్సిల్ వచ్చింది. ఆ పార్సిల్ ఒక చిన్న పాప తెచ్చింది. తనకు ఒక అంకుల్ ఇచ్చాడని చెప్పింది. పార్సిల్ ఇచ్చేసి వెళ్లి పోయింది. ఆ పార్సిల్ ఓపెన్ చేసిన వికాస్ జైన్ భార్య లోపల ఉన్న వస్తువులు చూసి నిర్ఘాంత పోయింది. అందులో ఒక మానవ బొటన వేలు, ఒక స్మార్ట్ వాచీ, ఒక లెటర్ ఉంది. వాటిని చూసి ఆమె ఆ పార్సిల్ ను కిందపడేసింది. తన భర్తను పిలిచి విషయం చెప్పింది. ఆ ప్రాంతంలో బిజినెస్‌మెన్ వికాస్ జైన్ కు మంచి పేరుంది. ఆయన ఆ లెటర్ చదివాడు. అందులో దుండగులు బెదిరిస్తూ ఓ వార్నింగ్ ఇచ్చారు. పది రోజుల్లుగా రూ.5 కోట్లు చెల్లించకపోతే అతనికి, అతని కుటుంబానికి కీడు జరుగుతుందని.. వారి ప్రాణాలు తీస్తామని రాసి ఉంది. పైగా ఆ రూ.5 కోట్లు ఒక మంచి పని కోసం ఖర్చు చేస్తున్నామని తప్పక చెల్లించాలని ఉంది.

షహదారా ప్రాంతానికి చెందిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ గౌతం ఆ లెటర్ మీడియాకు చూపిస్తూ.. అందులోని వివరాలు చదివి వినిపించారు. “బ్రదర్ మీ గురించి మాకు బాగా తెలుసు. గాజాలో చాలా భయనక పరిస్థితులున్నాయి. ఇజ్రాయెల్ హింసాత్మకంగా, అమానవీయంగా ప్రవర్తిస్తోంది. అక్కడ ప్రజలకు తిండి లేదు. కరువుతో చనిపోతున్నారు. మా సమాజానికి చెందిన వారు అలా కష్టాలు పడుతుండడం మేము సహించలేక ఉన్నాం.వారికి మీరు తప్పనిసరిగా సాయం చేయాల్సిందే. మీకు వేరే దారి లేదు. పది రోజుల్లోగా రూ.5 కోట్లు చెల్లించాలి. 11వ రోజు ఉదయం 8 గంటలకు మీ ఇంటి ముందు మేము చెప్పిన ప్రాంతంలో రూ.5 కోట్లు సిద్ధంగా ఉండాలి. లేకపోతే మీకు ప్రాణాలకు ప్రమాదం. మీ కుటుంబానికి ప్రమాదం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఒకరు మేము చెప్పినట్లు చేయలేదు. వారి కుటుంబ సభ్యులు చనిపోయారు. అందుకే పోలీసులు లేదా ఇతరుల జోలికి వెళ్లకుండా మేము చెప్పినట్లు జరగాలి అంతే.” అని బెదిరింపు ధోరణితో రాసి ఉంది.


Also Read: కోట్ల విలువ చేసే చేప ఉమ్మిపై ఇండియాలో నిషేధం.. ఎందుకంటే?

లెటర్ పంపిన వారిని పట్టుకున్న పోలీసులు
పోలీసులు ఆ లెటర్ తెచ్చిన పాపను పట్టుకున్నారు. ఆమెను ప్రశ్నించగా.. ఆమె అభిషేక్ అంకుల్ (45) పేరు చెప్పింది. అభిషేక్ మరెవరో కాదు.. వికాస్ జైన్ స్నేహితుడే. అభిషేక్ తో పాటు వికాస్ జైన్ బంధువు అయిన సచిన్ జైన్ కూడా ఈ కుట్రలో భాగస్వామిగా ఉన్నాడు. న్ మేనకోడలే ఆ చిన్న పాప. పార్సిల్ డెలివరీ రోజు అభిషేక్ ఆ పాపకు అన్నీ చెప్పి పంపించాడు. దూరం నుంచి అన్నీ చూస్తూనే ఉన్నాడు. వారితో పాటు మరో ఇద్దరు కూడా ఈ ప్లాన్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

అది అసలు మానవ బొటన వేలు కాదు.
పార్సిల్ లో ఉన్న మానవ బొటన వేలు అసలుది కాదు. ఆన్ లైన్ లో రూ.3500 పెట్టి కొనుగోలు చేసిన సిలికాన్ బొటన వేలు. ఆ బొటన వేలులో చికెన్ షాపు నుంచి చికెన్ తీసుకొచ్చి దాన్ని కైమా చేసి నింపారు. చికెన్ ఎముకలు కూడా అందులో స్టఫ్ చేశారు.అప్పడది ఒరిజనల్ మానవ బొటన వేలు లాగా కనిపించిందని పోలీసులు వెల్లడించారు. పార్సిల్ లో ఉన్న స్మార్ట్ వాచీని కూడా రూ.500కు కొనుగోలు చేసి అది నరికిన చేయికి చెందినదిగా చూపించారు.

పోలీసులు అభిషేక్ తెలిపిన వివరాల ప్రకారం.. సచిన్ జైన్ ని కూడా అరెస్ట చేసి జుడిషియల్ కస్టడీకి పంపించారు. ఆ పాపను కూడా అదుపులోకి తీసుకొని జువెనైల్ హోమ్ కు పంపించారు. ఈ ముగ్గురికి కూడా ఇంతకుముందు నేర చరిత్ర లేదని పోలీసులు తెలిపారు.

Related News

Washing Machine Mistake: వాషింగ్ మిషన్‌లో బట్టలు వేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే..

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Big Stories

×