Today Gold Rate: పెళ్లిల్లు, ఏ ఫంక్షన్స్ జరిగినా ముందుగా గుర్తొచ్చేది పసిడి. కేవలం బంగారం ఆభరణమే కాదు.. పెట్టుబడులకు సాధనంగా భావిస్తారు. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న మార్పులు కారణంగానే రికార్డ్ స్ఠాయిలో బంగారం ధరలు అమాంతం పెరిగాయి. ముఖ్యంగా డాలర్ వాల్యూ పడిపోవడం, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కారణంగా పసిడి ధరలు పెరగడానికి కారణం అని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు స్టాక్ మార్కెట్లో భారీగా పతనం అవుతున్నాయి. మఖ్యంగా ఐటీ కెంపెనీలు, ఫార్మా రంగానికి చెందిన కంపెనీలు పెద్ద ఎత్తున నష్టపోవడంతో.. పసిడి ధరలు పెరగడానికి మరొక కారణం అని చెప్పొచ్చు.
ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో బంగారం పెరగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కాగా ఇటీవల సుంకం పేరుతో ఇతర దేశాలపై ట్రంప్ కొరడా జులిపిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం అక్రమంగా వలస దారులను గుర్తించి వారిని అమెరికా నుండి, భారత్ పంపించింది. ఇవన్ని కూడా పుత్తడి ధరలు పెరగడానికి కారణం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే.. గ్రాము రూ.8,060 వరకు పెరిగింది. 22 క్యారెట్ల తులం బంగారం ధర ఏకంగా రూ.800 పెరిగి, రూ.80,600 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధరకు ఏకంగా 870 పెరిగి రూ.87,930 వద్ద దూసుకుపోతుంది. ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.80,600 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,930 వద్ద కొనసాగుతోంది.
విజయవాడ, గుంటూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.80,600 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,930 ధర పలుకుతోంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.80,600 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,930 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.80,750 రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది. 4 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.88,080 పలుకుతోంది.
ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.80,600 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,930 చేరుకుంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.80,600కి చేరగా.. పది గ్రాముల బంగారం ధర రూ.87,930కి చేరుకుంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.80,600 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,930 ధర పలుకుతోంది.
కోల్‌కతా, కేరళలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.80,600 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,930 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
వెండి ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, కేరళ, విజయవాడలో కిలో వెండి ధర రూ.1,07,000 ఉంది.
ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో కిలో వెండి ధర రూ.95,500 వద్ద కొనసాగుతోంది.