SCR Maha Kumbh Mela Special Trains: ఉత్తర ప్రదేశ్ లోని మహా కుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు ప్రయగరాజ్ కు చేరుకుంటున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 140 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. లక్షా 30 వేల మంది ప్రయాణీకులు దక్షిణ మధ్య రైల్వే ద్వారా కుంభమేళాకు వెళ్లినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
8 స్టేషన్ల ద్వారా 330 ప్రత్యేక రైళ్లు!
అటు కుంభమేళా జరుగుతున్న ప్రయాగరాజ్ లో రైల్వేశాఖ ఎలాంటి వసతులు కల్పించడం లేదంటూ వస్తున్న వార్తలను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కొట్టిపారేశారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలేనని పీఆర్వో ఏ శ్రీధర్ తెలిపారు. ఈ పుకార్లను భక్తులు నమ్మకూడదన్నారు. దక్షిణ మధ్య రైల్వే ద్వారా ఇప్పటికే లక్షలాది మంది ప్రయాణీకులు మహా కుంభమేళాకు వెళ్లారని తెలిపారు. కుంభమేళాకు వెళ్లే భక్తులకు అవసరం అయిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రయాగరాజ్ నుంచి ఈ నెల 9న 8 స్టేషన్ల ద్వారా 330 ప్రత్యేక రైళ్లు రాకపోకలు కొనసాగించాయన్నారు. ప్రయాణీకులకు అన్నిరకాల వసతులను కల్పిస్తూ సౌకర్యవంతంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రయాగరాజ్ లో సౌత్ సెంట్రల్ రైల్వేకు సంబంధించి అధికారులు ఉంటూ నిరంతరం భక్తుల రద్దీని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. తక్కువ ధరలో భక్తులు కుంభమేళాకు వెళ్లేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పీఆర్వో శ్రీధర్ తెలిపారు.
సౌత్ సెంట్రల్ జోన్ నుంచి 140 ప్రత్యేక రైళ్లు
ఇక కుంభమేళా కోసం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి 140 రైళ్లను నడుపున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు, మొత్తం 179 రైళ్లను నడపాలని ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించింది. ఈ రైళ్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో వేర్వేరు తేదీలలో నడపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి బయల్దేరే రైళ్లు ప్రయాగరాజ్ మీదుగా వెళ్లేలా షెడ్యూల్ చేసినట్లు తెలిపారు. అవసరానికి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే నుంచి మరో నాలుగు ప్రత్యేక రైళ్లను నడపడానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయన్నారు.
#IndianRailways working on war footing to make sure that devotees come in & go back smoothly during ongoing #MahaKumbh2025
All 08 stns in Prayagraj including Prayagraj Junction are fully functional; Rlys run 330 trains on Sunday &201 trains by 3 pm to ease the rush of pilgrims pic.twitter.com/nefOA3JeFu
— South Central Railway (@SCRailwayIndia) February 10, 2025
Read Also: కుంభమేళా భక్తులకు షాక్, ప్రయాగరాజ్‌లోని సంగం రైల్వే స్టేషన్ మూసివేత!
కుంభమేళా కోసం 13 వేళ రైళ్లు కేటాయింపు
ఇక 140 ఏండ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా కోసం భారతీయ రైల్వే సంస్థ దేశ వ్యాప్తంగా 13 వేల రైళ్లను నడుపుతున్నది. వీటిలో 3,100 ప్రత్యేక రైళ్లు కాగా, మిగతా 10, 000 సాధారణ రైళ్లు ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మౌని అమావాస్య రోజున ప్రయాగరాజ్ డివిజన్ లో 150 కంటే ఎక్కువ ప్రత్యేక రైళ్లను నడిపినట్లు వెల్లడించారు. భారతీయ రైల్వే చరిత్రలోనే ఓ రికార్డుగా అభివర్ణించారు. భక్తుల ప్రయాణాలను సులభతరం చేసేందుకు రైల్వే సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వాటిలో కలర్-కోడెడ్ టికెట్లు, అదనపు షెల్టర్ ప్రాంతాలు, సురక్షితమైన బోర్డింగ్, డీబోర్డింగ్ వసతులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
"SCR is running 140 Special trains to cater to the Pilgrim rush attending Kumbh Mela" #MahaKumbhMela2025 #KumbhMela pic.twitter.com/Gbju0ZZQD3
— South Central Railway (@SCRailwayIndia) February 10, 2025
Read Also: రైల్ ఇంజిన్‌లోనూ కిక్కిరిసిన ప్రయాణీకులు.. మరి ఆ రైలు ఎవరు నడుపుతారు రా బాబు!