BigTV English

Gujarat Titans: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌కు కొత్త యజమాని?

Gujarat Titans: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌కు కొత్త యజమాని?

Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లో ఎంట్రీ ఇచ్చిన 2022 సీజన్ లోనే టైటిల్ విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ {జీ.టీ} ప్రస్తుతం సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్ యాజమాన్యంలో ఉంది. ఈ జట్టు తన తొలి సీజన్ లోనే టోర్నీ గెలుచుకొని, ఆ తర్వాత సీజన్ లో ఫైనల్ కీ చేరుకుంది. కానీ ఐపీఎల్ 2024 సీజన్ లో మాత్రం ఎనిమిదవ స్థానానికి పరిమితమైంది. అయితే తాజాగా గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.


Also Read: Amitabh Bachchan: గాంధీ మార్గంలో బ్రిటీష్‌ వాళ్ల అంతుచూశాడు.. రోహిత్‌ పై బచ్చన్‌ కామెంట్‌ ?

ఈ ఫ్రాంచైజీ యాజమాన్యం మారబోతోంది. గుజరాత్ టైటాన్స్ జట్టును టొరెంట్ గ్రూప్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఆ ఫ్రాంచైజీ వాటాలో 67% మెజారిటీ స్టేక్ దక్కించుకోనుంది. కాగా 2022లో లంక్సెంబర్గ్ కి చెందిన సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్ ఈ జట్టును కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ ఫ్రాంచైజీలో తమ వాటాను అమ్మేసేందుకు సిద్ధం కావడంతో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానికి చెందిన అదానీ గ్రూప్ కి గట్టి షాక్ తగలబోతోంది.


కాగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా {బీసీసీ} ఐపీఎల్ కొత్త జట్ల విక్రయాలకు సంబంధించి లాక్ – ఇన్ పీరియడ్ ని విధించింది. ఇది 2025 ఫిబ్రవరి కి ఎత్తివేయడంతో ఫ్రాంచైజీలు తమ వాటాలను విక్రయించడానికి వీలు కల్పించింది. ఇప్పుడు ఎంత ధరకు సీవీసీ గ్రూప్ తమ వాటాను అమ్ముకోనుందనేది మాత్రం తెలియదు. మరోవైపు వీలైనంత తొందరగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని టొరంటో గ్రూప్ భావిస్తోంది.

ఇక ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ కీలక ఆటగాళ్లను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ జట్టుకు శుబ్ మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. 2025 మెగా వేళానికి ముందు కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది గుజరాత్. రషీద్ ఖాన్ 18 కోట్లు, గిల్ 16.5 కోట్లు, సాయి సుదర్శన్ 8.5 కోట్లు, రాహుల్ తేవాటియ 4 కోట్లు, షారుఖ్ ఖాన్ 4 ఓట్లకు రిటైన్ చేసుకుంది.

ఇక గుజరాత్ ఐపీఎల్ 2025 పూర్తి జట్టు వివరాలు: రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, కగిసో రబడ (రూ. 10.75 కోట్లు), జోస్ బట్లర్ (రూ. 15.75 కోట్లు). మహ్మద్ సిరాజ్ (రూ. 12.25 కోట్లు), ప్రసిద్ధ్ కృష్ణ (రూ. 9.50 కోట్లు), నిశాంత్ సింధు (రూ. 30 లక్షలు), మహిపాల్ లొమ్రోర్ (రూ. 1.70 కోట్లు),

Also Read: Martin Guptill: మార్టిన్ గప్టిల్ విధ్వంసం.. 42 బంతుల్లో 160 పరుగులు!

కుమార్ కుషాగ్రా (రూ. 65 లక్షలు), అనుజ్ రావత్ (రూ. 30 లక్షలు), సుందర్ 30 లక్షలు), సుందర్ మానవ్. (రూ. 3.20 కోట్లు), జెరాల్డ్ కోయెట్జీ (రూ. 2.40 కోట్లు), అర్షద్ ఖాన్ (రూ. 1.30 కోట్లు), గుర్నూర్ బ్రార్ (రూ. 1.30 కోట్లు), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (రూ. 2.60 కోట్లు), సాయి యవద్ శర్మ (రూ. 2 కోట్లు), జయంత్ శర్మ (రూ. 2 కోట్లు), ఇషాంత్. 7 75 లక్షలు), గ్లెన్ ఫిలిప్స్ (రూ. 2 కోట్లు), కరీం జనత్ (రూ. 75 లక్షలు), కుల్వంత్ ఖేజ్రోలియా (రూ. 30 లక్షలు).

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×