Today Gold Price: బంగారం ధరల్లో నిత్యం హెచ్చు తగ్గులు కనిపిస్తాయి. గత కొద్దిరోజుల నుంచి బంగారం ధరలు తగ్గి సడెన్ షాక్ ఇచ్చారు. దేశీయ మార్కెట్లో ఈరోజు(నవంబర్ 30) గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో గిరాకీ ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతుండటం కొనుగోలుదారులు కాస్త ఊరటనిచ్చాయని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో గరిష్ఠ స్థాయిలో గోల్డ్ రేట్స్ తగ్గిపోవడమే ఇందుకు కారణం అని నిపుణులు చెబుతున్నారు.
యూఎస్ఏ ఫెడ్ వడ్డీ రేట్ల కోత, డాలర్ వాల్యూ, దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులను బట్టే బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తాయి. గత రెండు, మూడు వారాల నుంచి వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,500కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,000 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఇలా..
ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,650 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,150 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.71,500 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,000 కి చేరుకుంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,650 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,150 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,650 చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,150 వద్ద కొనసాగుతోంది.
Also Read: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..పెరిగిన బంగారం ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,650 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,150 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,650 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,150 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నం, గుంటూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,650 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,150 వద్ద ట్రేండింగ్‌లో ఉంది.
వెండి ధరల ఇలా..
వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో కిలో వెండి ధర రూ.1,00,000 ఉంది.
ఢిల్లీ, బెంగుళూరు, కోల్ కత్తాలో కిలో వెండి ధర రూ. 91, 500 వద్ద ట్రేండింగ్‌లో ఉన్నాయి.