Road Accident: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్‌లో నలుగురు మృత్యువాత పడ్డారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఇంకా డీటేల్స్ లోకి ఒక్కసారి వెళ్దాం.
విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి ప్రాంతంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం శ్రీకాకుళం నుండి విశాఖ వైపు వస్తోంది ఓ కారు. వేగంగా వస్తున్న కారు టైర్ పేలిపోయింది.
వేగాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు. కారు డివైడర్ మీదుగా పల్టీ కొట్టి అటుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు స్పాట్‌లో మృతి చెందారు. లారీ డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయలేకపోయాడు. ఈ క్రమంలో బలంగా కారుని ఢీ కొట్టింది లారీ.
ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు కాలు విరిగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. మృతులకు సంబంధించి సమాచారం సేకరించే పనిలోపడ్డారు.
ALSO READ: ప్రేమతో పెళ్లి.. ఆ తర్వాత హత్య.. నాగర్ కర్నూల్ లో దారుణ ఘటన
అంబులెన్స్‌లో మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. మృతులు ఏ ప్రాంతానికి చెందినవారు అనేదానిపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.