Mogalturu Crime news: మొగల్తూరు హైవేపై అదుపు తప్పి పంటబోదేలో ప్రమాదం జరిగింది. అక్కడే ఉపాధి హమీ కోసం వచ్చిన మహిళా కూలీలపై బొలెరో వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయారు, మరో నలుకొరకు తీవ్ర గాయాలు అయ్యాయి.
Also Read: అక్కాచెల్లెళ్లకు ఎంత కష్టమొచ్చింది.. ఇదీ అసలు కథ
పశ్చిమ గోదావరి జిల్లా మెుగల్తూరు హైవేపై వెళ్తుండగా అక్కడ పక్కనే ఉన్న పంటపొలాల్లో పూడిక ఉపాధి హమీ పని చేస్తున్న మహిళ కూలీలపైకి బొలెరే వ్యాన్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడ గమనించిన స్థానికులు.. తీవ్రంగా గాయాలపాలైన వారిని అక్కడి సమీపంలోని నర్సాపురం ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. అలాగే చనిపోయిన వారిని గంగ, పావనిగా గుర్తించారు.. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.