Today Gold Rate: అక్షయ తృతీయ సందర్భంగా.. బంగారం ధరలు భారీగా పెరిగి.. పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు.. అంతకంతకూ పెరుగుతూ.. తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే నిన్న, మొన్నటి వరకు బంగారం ధరలు తగ్గినప్పటికీ.. ఈరోజు (ఫిబ్రవరి 29) మళ్లీ పెరిగాయి. మన భారతదేశంలో అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో పసిడి ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం గోల్డ్ రేట్స్ చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారానికి రూ.400 పెరిగింది.. దీంతో రూ. 89,800 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధరకు రూ.440 పెరిగి, రూ. 97,970 వద్ద కొనసాగుతోంది.
ధరల పెరుగుదల కారణంగా, బంగారం అమ్మకాలు తగ్గినప్పటికీ, తేలికపాటి ఆభరణాలపై డిమాండ్ కొనసాగుతోంది. వివాహాల సీజన్ లేకపోవడం వల్ల, కొంతమంది వినియోగదారులు బంగారం కొనుగోలు చేయడం తగ్గించారు. కాగా.. అక్షయ తృతీయ వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. 2025లో అక్షయ తృతీయ ఏప్రిల్ 30న వచ్చింది. ఈ రోజు లక్ష్మీదేవి ఆశీస్సుల కోసం బంగారం, ఆస్తులు, ఇతర పెట్టుబడులను కొనుగోలు చేయడానికి అనువైన సమయంగా భావిస్తారు. ఆరోజు బంగారం కొనుగోలు చేస్తే.. ఆర్థిక స్థిరత్వానికి, సంపద వృద్ధికి దోహదపడుతుందని భావిస్తారు. ముందు రోజుల్లో బంగారం మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సూచీలు మంగళవారం లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు ఇలా
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,800 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 970 పలుకుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,800 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 970 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,800 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 970 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,950 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 120 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,800 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 970 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,800 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 970 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: బ్యాంక్ లోన్, క్రెడిట్ కార్డ్.. ఇలా అంటగడతారు, అగాధంలో తోస్తారు..ఇలా చేస్తే సేఫ్!
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాదిరిగా.. వెండి ధరలు కూడా కాస్త పెరిగాయి.. కిలో వెండి ధర ఏకంగా రూ.1,11,000 వద్ద కొనసాగుతోంది
ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్ లో కిలో వెండి ధర రూ.1,11,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,00,500 వద్ద కొనసాగుతోంది.