Today Gold Rate: బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చు తగ్గులు కనిపిస్తాయి. నిత్యం గోల్డ్, వెండి ధరల్లో మార్పులు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. రెండు, మూడు రోజుల నుంచి భారీగా పెరుగుతున్నాయి. గోల్డ్ రేట్స్ ఏకంగా రూ.80,000 లకు చేరువలో ఉండగా.. వెండి ధరలు మాత్రం ఏకంగా లక్ష దాటేసింది. దీంతో కొనుగోలుదారులు ఒకింత డైలమాలో పడినట్లే కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యెరెట్ల తులం బంగారం ధర రూ.800 పెరిగి, రూ.72,850కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.870 పెరిగి, 79,470 పలుకుతోంది. పలు నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం.
బంగారం ధరలు ఇలా..
ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.73,000 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 79,620 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,850 చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79, 470 ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,850 చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79, 470 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,850 చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79, 470కు చేరుకుంది.
కోల్ కత్తా, కేరళలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,850 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79, 470 పలుకుతోంది.
Also Read: ఆధార్ నుంచి ఐటీఆర్ వరకు.. వెంటనే ఈ పనులు చేసేయండి!
ఏపీ, తెలంగాణలో గోల్డ్ రేట్స్ ఇలా..
తెలంగాణ, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,850 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79, 470 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,850 చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79, 470 ఉంది.
విశాఖపట్నం, గుంటూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,850 చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79, 470 ఉంది.
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. చెన్నై, హైదరాబాద్, కేరళ, విజయవాడలో కిలో వెండి ధర రూ.1,03,000 ఉంది.
ఢిల్లీ, ముంబై, బెంగుళూరులో అహ్మదాబాద్‌లో కిలో వెండి ధర రూ. 95,500 వద్ద స్థిరంగా ఉంది.