BigTV English

F1 Visa Indians : భారత విద్యార్థులకు భారీగా వీసాలు తగ్గించిన అమెరికా..

F1 Visa Indians : భారత విద్యార్థులకు భారీగా వీసాలు తగ్గించిన అమెరికా..

F1 Visa Indians | అగ్రరాజ్యం అమెరికాలో చదువుకోవాలునుకునే భారత విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం వీసాలు జారీ చేయడం భారీగా తగ్గించేసింది. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ తాజా రిపోర్ట్ ప్రకారం.. భారతీయుల కోసం జారీ చేసే F-1 స్టూడెంట్ వీసాలో గణనీయంగా సంఖ్య తగ్గిపోయింది. రిపోర్ట్ లోని డేటా ప్రకారం.. 2023 సంవత్సరంతో పోలిస్తే.. 2024 మొదటి 9 నెలల్లో దాదాపు 38 శాతం తక్కువ మంది విద్యార్థులకే అమెరికా ప్రభుత్వం F-1 స్టూడెంట్ వీసాలు జారీ చేసింది.


అమెరికా బ్యూరో ఆఫ్ కౌన్సులార్ అఫేర్స్ నెలవారీ డేటా రిపోర్ట్ లో జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2024 మధ్య భారతీయ విద్యార్థులు కేవలం 64,008 మందికి మాత్రమే F-1 స్టూడెంట్ వీసాలు జారీ చేయబడ్డాయి. అదే గత సంవత్సరం మొదటి నెలల కాలంలో మొత్తం 1,03,495 భారత విద్యార్థులు F-1 స్టూడెంట్ వీసాలు పొందారు.

2020 కరోనా మహమ్మారి తరువాత భారత విద్యార్థులు F-1 స్టూడెంట్ వీసాలు అతి తక్కువగా జారీ చేయడం ఇదే తొలిసారి. 2020 సంవత్సరంలో కరోనా కారణంగా కేవలం 6,646 మంది భారతీయులకు F-1 స్టూడెంట్ వీసాలు జారీ చేశారు. ఆ తరువాత 2021 జనవరి – సెప్టెంబర్ మధ్య కాలంలో 65,235 మంది భారతీయులకు F-1 స్టూడెంట్ వీసాలు లభించాయి. 2022 సంవత్సరం మొదటి 9 నెలల్లో ఈ సంఖ్య 93,181 గా ఉంది.


Also Read: దుబాయ్ వీసా దొరకడం ఇక చాలా కష్టం.. భారతీయుల అప్లికేషన్లు భారీ సంఖ్యలో తిరస్కరణ

అమెరికా లో చదువుకోవడానికి ప్రపంచదేశాల నుంచి వచ్చే విద్యార్థుల్లో భారతీయులే అందరికంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇండియా తరువాత రెండవ స్థానంలో చైనా ఉంది.

అయితే ఇలా తక్కువగా స్టూడెంట్ వీసాలు జారీ చేయడం భారతీయుల విషయంలోనే కాదు.. చైనా విద్యార్థులకు కూడా F-1 స్టూడెంట్ వీసాలు చాలా తక్కువగా లభించాయి. 2024 సంవత్సరానికి గాను చైనా విద్యార్థులకు జారీ F-1 స్టూడెంట్ వీసాలు 8 శాతం తగ్గాయి.

అధికారిక డేటా ప్రకారం.. 2024 సంవత్సరం జనవరి – సెప్టెంబర్ కాలానికి 73,781 మంది చైనా విద్యార్థులకు మాత్రమే F-1 స్టూడెంట్ వీసాలు లభించాయి. 2023 సంవత్సరంలో ఇదే కాలానికి ఈ సంఖ్య 80,603 గా ఉంది. అయితే చైనా విద్యార్థులకు 2022 సంవత్సరంలో అతితక్కువగా 52,034 వీసాలు మాత్రమే దక్కాయి. దీనికి కారణం.. చైనాలో కరోనా వైరస్ వివాదం కారణంగా 2022 వరకు తక్కువ సంఖ్యలోనే F-1 స్టూడెంట్ వీసాలు జారీ అయ్యాయి.

F-1 స్టూడెంట్ వీసా అంటే ఏంటి?
F-1 స్టూడెంట్ వీసాలు అనేది ఒక నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. ఈ వీసా ద్వారా ప్రపంచదేశాల నుంచి వచ్చే విద్యార్థులకు అమెరికాలో చదువుకునేందుకు అనుమతి లభిస్తుంది. అమెరికా చదువుకోవడానికి లభించే వీసాల్లో ఇది అత్యంత సాధారణ వీసా.

ఓపెన్ డోర్స్ అనే సంస్థ రిపోర్ట్ ప్రకారం.. 2024 సంవత్సరానికి గాను అమెరికాలో చదువుకునే విద్యార్థుల్లో ఎక్కువగా భారతీయులు ఉన్నారు. అమెరికా విద్యా సంస్థల్లో చదువుకునే భారతీయలు సంఖ్య 2024 డేటా ప్రకారం.. 3,31,000 ఉండగా.. 2023లో ఈ సంఖ్య 2,68,923గా ఉంది.

ఇదే రిపోర్ట్ ప్రకారం.. అమెరికాలో చదువుకునే చైనా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. 2024 సంవత్సరానికి గాను అమెరికాలో మొత్తం చైనా విద్యార్థుల సంఖ్య 2,77,398 గా ఉంటే 2023లో మరో 12,000 ఎక్కువగా అంటే 2,89,526గా ఉంది.

Related News

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Big Stories

×