Today Gold Rate: భారతీయ మహిళ అనగానే మనందరికి గుర్తొచ్చేది అందమైన చీరకట్టు, నుదిటిపై బొట్టు, తర్వాత మెడలో బంగారం. దశాబ్దాల కాలంగా ఇండియాలో గోల్డ్‌కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏళ్లు గడుస్తున్నా బంగారానికి డిమాండ్ పెరగడంతో పాటు రేటు కూడా అంతకంతకు పెరుగుతోంది. పేద, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారికి గోల్డ్ అంటే చాలా ఇష్టం. ఏ శుభకార్యం జరిగిన బంగారానికి పెద్ధ పీఠవేయాల్సిందే.
అదే ఇండియాలో ట్రెండ్. ప్రస్తుతం బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఒక రోజు ఉన్న రేట్లు మరొక రోజు ఉండట్లేదు. దీనికి అనేక కారణాలు కావచ్చు. శనివారంతో పోలిస్తే.. నేడు (డిసెంబర్ 8) ఆదివారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate)రూ. 71,150 ఉంది. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.77,620 వద్ద కొనసాగుతోంది. వెండి ధర చూస్తే.. రూ. 1000 తగ్గి కిలో వెండి ధర రూ.1,00,000 ఉంది. ప్రస్తుతం పట్టణ నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం.
గోల్డ్ రేట్స్ ఇలా(Gold Rate)..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,150 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,620 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,150 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,620 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నం, గుంటూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,150 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,620కి ఉంది.
ఢిల్లీలో 22 గ్రాముల తులం పసిడి ధర రూ.71,300ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,770 పలుకుతోంది.
ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,150 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,620 వద్ద కొనసాగుతోంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,150కి చేరగా. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,620 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,150 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,620 ట్రేడింగ్‌లో ఉంది.
కోల్ కత్తా, కేరళలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,150 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,620 పలుకుతోంది.
Also Read: వడ్డీ రేట్లు తగ్గించని ఆర్బిఐ.. ప్రస్తుత రేట్లు యధాతథం.. ఈఎంఐలపై ప్రభావం ఉంటుందా?
వెండి ధరలు ఇలా(Silver Rate)..
ఢిల్లీ, హైదరాబాద్, కేరళలో కిలో వెండి ధర రూ.1,00,000 ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగుళూరులో కిలో వెండి ధర రూ.92,000 వద్ద కొనసాగుతోంది.