73 corpse Thailand| ప్రపంచంలో ఎన్నో వింత సంప్రదాయాలున్నాయి. అయితే కొన్ని సంప్రదాయాలకు నేటి సమాజం ఆమోదించదు. మానవత్వానికి వ్యతిరేకమైన పురాతన విధి విధానాలు, సంప్రదాయాలను నేటి తరవ వ్యతిరేకిస్తుంది. అయినా కొంతమంది పాత ఆచారాలను పాటిస్తూనే ఉంటారు. తాజాగా ఒక పురాతన గుడి లోపల 73 మృతదేహాలతో పూజ చేస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పైగా ఆ సువిశాల గుడి అడవి మధ్యలో ఉంది. అక్కడ దాదాపు 600 మొసళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. థాయ్ ల్యాండ్ దేశంలో వెలుగుచూసిన ఈ విషయాల గురించి తెలిసి సోషల్ మీడియాలో నెటిజెన్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే మీడియా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. థాయ్ ల్యాండ్ దేశం ఫిచిత్ రాష్ట్రం ఫో థాలె జిల్లా సమీపంలో ఉన్న పురాతన గుడిలో పోలీసులు కొన్ని రోజుల క్రితం తనిఖీలు చేశారు. ఆ పురాతన గుడి అడవి మధ్యలో ఉంది. ఆ పురాతన గుడి పేరు థిపాక్‌సాంగ్ ప సంగ్‌నయాథమ్. ఈ గుడి అక్కడ చాలా ఫేమస్. కానీ అడవి మధ్యలో ఉండడంతో భక్తులు అక్కడికి వెళ్లడం అరుదు.
Also Read: ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న ప్రెసిడెంట్.. రాజీనామా డిమాండ్ చేసిన ఎంపీలు
అయిేత నవంబర్ 22, 2024న పోలీసులు గుడిలో తనిఖీలు చేయగా.. గుడి సమీపంలోని గుహల వద్ద ప్రతి కొత్త దూరంలో 4-5 శవాలు లభించాయి. ఇది చూసి పోలీసులు ఏదో క్షుద్ర పూజల కోసం హత్యలు చేశారని అనుమానించి గుడిలో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. పైగా గుడి చుట్టపక్కల అన్నీ నీటి ప్రాంతాల్లో భారీ సంఖ్యలో మొసళ్లు కనిపించాయి. గుడిలోపల యోగా మందిరాలు, సన్యాసుల భోజనాల కోసం నాలుగు డైనింగ్ హాళ్లు కూడా ఉన్నాయి.
గుడి పరిసరాల్లో లభించిన మృతదేశాలను లెక్కిస్తే వాటి సంఖ్య 41గా తేలింది. అయితే నాలుగు రోజుల తరువాత మరి కొద్ది దూరంలో అదే గుడికి చెందిన మరో స్థూపం వద్ద మరో 32 శవాలు లభించాయి. దీంతో గుడి ప్రధాన పూజారి కోసం అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఆయన ఆ సమయంలో అక్కడ లేరు. ఇటీవల ఆయన విదేశాల నుంచి తిరిగి వచ్చి జరిగిన దాని గురించి వివరణ ఇచ్చారు.
అది బౌద్ధుల మందిరం అని.. ధ్యానం కోసం, మృత్యువుని జపిస్తూ చేసే కార్యక్రమంలో శవాల మధ్య కూర్చొని పరామాత్ముడిని స్తుతిస్తూ ధాన్యం చేస్తూ ఉంటామని ఆయన అన్నారు. పైగా పోలీసులు స్వాధీనం చేసుకున్న శవాలన్నీ గుడిలోని భక్తులు, వారి కుటుంబ సభ్యులకు చెందినవని తెలిపారు. అందుకోసం చనిపోయిన వారి డెత్ సర్టిఫికెట్లు కూడా చూపించారు. తాము చట్టవ్యతిరేకంగా ఏమీ చేయడం లేదని.. శవాలు కుళ్లిపోయే పరిస్థితి వస్తే.. వాటిని మొసళ్లకు ఆహారంగా వినియోగిస్తున్నామని షాకింగ్ విషాయలు వెల్లడించారు.
అయితే ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. శవాలు లభించిన రెండు స్థానాలను పోలీసులు సీజ్ చేశారు. థాయ్ ల్యాండ్ లోని నేషనల్ ఆఫీస్ ఆఫ్ బుద్ధిజం ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేశాక నిర్ధారణ చేస్తామని తెలిపింది.