Today Gold Rate: మహిళలకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు (ఫిబ్రవరి 17th) మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధరకు రూ.550 పెరిగింది. దీంతో రూ.86, 620కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధరకు రూ.500 పెరిగి, రూ.79,400 వద్ద కొనసాగుతోంది. ఇకపోతే ఈ ఏడాది ప్రారంభంలోనే పసిడి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జనవరిలో కాస్త తగ్గింపు కనబరిచిన, ఫిబ్రవరిలో మాత్రం ఏకంగా తొంభై వేలకు చేరువైంది.
ఇంతలా గోల్డ్ రేట్స్ పెరగడానికి అంతర్జాతీయంగా నెలకొన్న మార్పులు దీనికి కారణం. ముఖ్యంగా రూపాయి వాల్యూ పడిపోవడం, బంగారం ధరలు వృద్ధి చెందడం, ముడి వసతుల కొరత, ఆర్ధిక సంక్షోభం ఇతర కారణాలు కావచ్చు. ఇక భారత్ దేశంలో గోల్డ్ రేట్స్(Gold Rate) అమాంతం పెరగడంతో వ్యాపారస్థులు, సామాన్యులు తీవ్ర ప్రభావితులయ్యారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పసిడి ధరలు పెరిగాయి. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. పట్టణ నగరాల్లో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
పట్టణ నగరాల్లో గోల్డ్ ప్రైజ్ ఇలా..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర రూ.79,400 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర ఎలా ఉందంటే.. రూ.86,620 పలుకుతోంది.
వైజాగ్‌లో గోల్డ్ రేట్స్ చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 79,400 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,620 కి చేరుకుంది.
విజయవాడ, గుంటూరులో కూడా ఈ ధరలే కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 79,400 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,620 పలుకుతోంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 79,550 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,770 చేరుకుంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 79,400 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,620కి చేరుకుంది.
బెంగళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 79,400 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,620 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 79,400 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,620 పలుకుతోంది.
కోల్ కత్తా, కేరళలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 79,400 చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,620 వద్ద కొనసాగుతోంది.
Also Read: నిమిషానికి 581 చాక్లెట్లు, 607 కేకులు.. వాలెంటైన్స్ డే ఈ కామర్స్ రికార్డ్ సేల్స్!
వెండి ధరలు పరిశీలిస్తే..
గోల్డ్ ధరలు రోజు రోజుకి పరుగులు పెడుతున్నా.. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నై, హైదరాబాద్, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ. 1,08,000 వద్ద కొనసాగుతోంది.
ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఇతర నగరాల్లో కిలో వెండి ధర రూ.1,08,000 వద్ద ట్రేడ్ అవుతోంది.