OTT Movie : హాలీవుడ్ ఫాంటసీ సినిమాలు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తూ ఉంటాయి. ఊహకు అందని విజువల్స్ తో ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ సినిమాలను పిల్లలతో సహా పెద్దలు కూడా ఇష్టపడుతూ చూస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక పేద టైలర్ కి ఒక రాజ్యానికి యువరాజు కాబోయే అవకాశం వస్తుంది. అతడు అవకాశాన్ని ఎలా వినియోగించుకున్నాడో తెలిస్తే కడుపుబ్బా నవ్వుకుంటారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ ఫాంటసీ మూవీ పేరు ‘ది బ్రేవ్ లిటిల్ టైలర్’ (The Brave little tailor). 2008 లో వచ్చిన ఈ మూవీకి క్రిస్టియన్ తీదే దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో ఒక టైలర్ గా పని చేస్తుంటాడు. ఇతనికి తినడానికి సరిగ్గా ఫుడ్ కూడా ఉండదు. ఒకరోజు తన ఇంటి దగ్గర తేనె అమ్ముకుంటూ వెళ్తున్న ఒక మహిళను పిలుస్తాడు. ఆమె తాను అందంగా ఉండడం వల్ల పిలిచాడని అనుకుంటుంది. అయితే ఆమె వచ్చాక, తేనే కాస్త అప్పుగా ఇవ్వమంటాడు. రెండు రోజుల్లోనే పైసలు ఇస్తానని చెప్తాడు. ఆమె కూడా సరేనని అతనికి కాస్త తేనే ఇస్తుంది. దానిని బ్రెడ్ కు పెట్టుకుని తినడానికి ప్రయత్నించే లోపు, కొన్ని ఈగలు దానిమీద వాలుతాయి. హీరో కోపంతో ఒక వస్తువుతో దాన్ని కొడతాడు. అప్పుడు దాని మీద ఉన్న ఏడు ఈగలు చనిపోతాయి. మరుసటి రోజు దానిని బ్యాగులోనే పెట్టుకుని, బిజినెస్ కోసం రాజ్యంలోకి వెళుతూ ఉంటాడు. అడవి మధ్యలో ఒక పెద్ద భూతం ఇతనికి కనిపిస్తాడు. హీరో ఆ భూతంతో నేను ఒక యుద్ధం చేశానని, ఒకేసారి ఏడు మందిని చంపానని చెప్తాడు. నిజానికి హీరో ఆ ఈగల్ని చంపి ఉంటాడు. అయితే నువ్వు నాకన్నా బలవంతుడు అయితే అని చెప్తూ ఒక రాయిని తీసుకుని భూతం పిండడంతో, అందులో నుంచి నీళ్లు వస్తాయి. హీరో తన దగ్గర ఉన్న స్పాంజ్ తీసుకుని పిండుతాడు. అది చూడటానికి అచ్చం రాయి లాగానే ఉంటుంది.
అ భూతం హీరోని ఇతడు నాకన్నా బలవంతుడని అనుకుంటాడు. అలా అక్కడినుంచి హీరో రాజ్యానికి వస్తాడు. మరోవైపు రాజ్యంలో యువరాణిని పెళ్లి చేసుకోవడానికి మంత్రి పథకం వేస్తూ ఉంటాడు. అయితే యువరాణికి అతన్ని చేసుకోవడం ఇష్టం ఉండదు. ఈ రాజ్యంలో పెద్ద భూతాలు ఉన్నాయని, వాటిని అంతం చేయాలని రాజుతో మంత్రి చెప్తాడు. అదే సమయంలో హీరోని, అక్కడున్న కొంతమంది సైనికులు రాజు దగ్గరికి తీసుకొస్తారు. ఇతడు మహా యోధుడు ఒకేసారి ఏడుగురిని అంతం చేశాడంటూ రాజుకు పరిచయం చేస్తారు. రాజు రాజ్యంలో ఉన్న సమస్యను హీరోకి చెప్తాడు. ఈ రాజ్యాన్ని కాపాడితే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు. అందుకు హీరో నేను ఒక్కడినే వెళ్లి వాళ్ళ అంతు చూస్తానని వెళ్తాడు. చివరికి హీరో ఆ రాక్షసులను ఎదుర్కొంటాడా? యువరాణిని పెళ్లి చేసుకుంటాడా ? మంత్రి ఉచ్చులో చిక్కుకుంటాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.