Tuni Municipality: తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం టీడీపీ-వైసీపీ మధ్య చిచ్చు పెట్టింది. ఈ క్రమంలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. జిల్లా అధ్యక్షుడు దాడి శెట్టి రాజాను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చివరకు పోలీసులతో వాగ్వాదానికి దిగారు మాజీ మంత్రి రాజా. పరిస్థితి గమనించిన పోలీసులు భారీగా మోహరించారు. కోరం లేకపోవడంతో వాయిదా మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు జేసీ.
తునిలో టీడీపీ-వైసీపీ ఘర్షణ
తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల ఉత్కంఠగా మారింది. ఎలాగైనా దక్కించుకోవాలని అధికార టీడీపీ ఉవ్విల్లూరుతోంది. పట్టుకోల్పోకుండా ఉండాలని వైసీపీ భావిస్తోంది. ఉపాధ్యక్ష పదవి దక్కించుకునేందుకు ఇరు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేశాయి. ఇప్పటికే వైసీపీ నుంచి 10 మంది కౌన్సెలర్లు టీడీపీలో చేరారు. ఇంకా అనేక మంది సైకిల్ ఎక్కేందుకు సిద్దమయ్యారు.
మిగిలినవారు వెళ్లకుండా కట్టడి చేయాలని భావిస్తున్నారు మాజీ మంత్రి, కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. ఉద్రిక్త పరిస్థితులు నడుమ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది వైస్ చైర్మన్ ఎన్నిక. ఈ పరిస్థితుల నేపథ్యంలో సోమవారం ఉదయం మున్సిపల్ ఛైర్మన్ ఇంటికి కౌన్సెలర్లు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అక్కడికి వచ్చారు. ఆయన రాకపై టీడీపీ కార్యకర్తలు, నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
తుని మున్సిపాల్టీలో ఏం జరిగింది?
తుని మున్సిపాలిటీలో 28 మంది కౌన్సెలర్లు ఉన్నారు. ఇప్పటికే 10 మంది టీడీపీలో చేశారు వైసీపీ కౌన్సెలర్లు. ఎక్స్ అఫీషియో ఓటుతో కలిసి ఆ సంఖ్య 11 చేరింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి దక్కించుకోవాలంటే మరో నలుగురు కౌన్సెలర్లు టీడీపీ వైపు మొగ్గు చూపితే వైస్ ఛైర్మన్ పదవి టీడీపీ సొంతం కానుంది.
ALSO READ: అనంతపురం సెంట్రల్ వర్సిటీ.. విద్యార్థుల నిరసనలు, బాత్రూమ్‌లో
మిగతా కౌన్సెలర్లు టీడీపీ వైపు వెళ్లకుండా వారిని ఛైర్మన్ ఇంట్లో దాచినట్టు తెలియగానే టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో కౌన్సెలర్లతో మాట్లాడటానికి వచ్చారు మాజీ మంత్రి దాడి శెట్టి రాజా. ఆయనను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. స్వేచ్ఛగా కౌన్సెలర్లు ఓటు వేసే విధంగా అవకాశం కల్పించాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఎన్నికల జరుగుతుందా? వాయిదా పడుతుందా?
పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి ఎన్నిక కొనసాగుతుందా? లేక వాయిదా పడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నిక నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలో సెక్షన్ 163(2) అమలు చేశారు పోలీసులు.
ఏపీలోని వివిధ ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవులపై ఎన్నిక జరుగుతోంది. ఇప్పటికే ముఖ్యమైన నగరాల్లో డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో వైస్ ఛైర్మన్ పదవులను టీడీపీ దక్కించుకుంది. అయితే తుని మున్సిపాల్టీ ఉపాధ్యక్ష పదవి ఎన్నిక రెండుసార్లు వాయిదా పడింది. దీన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార పార్టీ ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. టీడీపీ వ్యూహాన్ని ముందుగానే గమనించిన వైసీపీ, కౌన్సెలర్లు బయటకు వెళ్లకుండా ఛైర్మన్ ఇంట్లో క్యాంప్ రాజకీయాలు నిర్వహించిన విషయం తెల్సిందే.