Today Gold Rate: భారతీయులకు పసిడిపై మక్కువ ఎక్కువ. పెట్టుబడుల కోసమే కాకుండా బంగారం శుభకార్యాలు, పండుగలు, ఇతర పర్వదినాల్లో కూడా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇక పెళ్లిల్ల సీజన్ వచ్చేసింది. ఈ టైమ్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు పరిశీలిస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,400 వరకు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,168కి చేరుకుంది. వచ్చే వారం కూడా బంగారం ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు మినహా.. అంతగా మార్పులు ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయంగా నెలకొన్న మార్పులే దీనికి కారణం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దాం.
పట్టణ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఢిల్లీలో గోల్డ్ రేట్స్ చూస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,860కి చేరుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,550 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
చెన్నైలో గోల్డ్ రేట్స్ చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,400 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,710 పలుకుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,400 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,710 కి చేరుకుంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,400 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,710 పలుకుతోంది.
కేరళ, కోల్‌కత్తా ఇతర పట్టణ నగరాల్లో కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,400 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,710 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఇలా..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,400 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,710 పలుకుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,400 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,710 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,400 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,710 పలుకుతోంది.
వెండి ధరలు పరిశీలిస్తే..
బంగారం ధరలు మాదిరగా వెండి ధరలు కూడా గత కొద్ది రోజుల నుంచి భారీగా పెరుగుతున్నాయి. నేడు హైదరబాద్, వైజాగ్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.1,08,100 కి చేరుకుంది.
బెంగళూరు, కోల్‌కత్తా, ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.99,100 వద్ద కొనసాగుతోంది.