Priyanka Chopra Skin Care: ప్రియాంక చోప్రా , బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆమె నటన, అందానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రియాంక చోప్రా అంతర్జాతీయ ఫ్యాషన్ ఐకాన్‌గా కూడా ప్రసిద్ధి చెందారు.
ఇదిలా ఉంటే చాలా మంది ఆమె అభిమానులు ఆమె మచ్చలేని , మెరిసే చర్మం యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి ఆసక్తిగా చూపిస్తుంటారు. ప్రియాంక చోప్రా కూడా తన ఇంటర్వ్యూలలో చాలా సార్లు బయట దొరికే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కి బదులుగా హోం రెమెడీస్ ఉపయోగిస్తానని వెల్లడించింది.
అంతే కాకుండా ఒక ఇంటర్వ్యూలో, ఆమె తల్లి తన కోసం ఒక ప్రత్యేక ఫేస్ ప్యాక్ తయారు చేసే వారని దానిని తాను ఉపయోగించేదానినని చెప్పారు. మీరు కూడా ప్రియాంక చోప్రా లాగా మెరిసే, ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందాలనుకుంటే మీరు ఇంట్లోనే ఈ DIY ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని ఉపయోగించవచ్చు . ఈ ఫేస్ ప్యాక్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
2 టీస్పూన్లు – గోధుమ పిండి
1 చిటికెడు – పసుపు పొడి
1 టీస్పూన్ – నిమ్మరసం
2 టీస్పూన్లు – తాజా పెరుగు
1 టీస్పూన్ – రోజ్ వాటర్
ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి ?
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో పైన తెలిపిన మోతాదులో గోధుమ పిండి వేసి కలపండి. ఇప్పుడు దానికి చిటికెడు పసుపు వేసి మిక్స్ చేయండి. తర్వాత దానికి పెరుగు కలపండి. అనంతరం కొన్ని చుక్కల నిమ్మరసం వేసి మిక్స్ చేయండి. ఇది మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
తర్వాత దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలపండి. అన్ని పదార్థాలను బాగా మిక్స్ చేయండి తద్వారా ఇది మంచి పేస్ట్ లాగా తయారు అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. దీన్ని మీ చర్మంపై సున్నితంగా అప్లై చేసి మసాజ్ చేయండి. 30 నిమిషాల తర్వాత వాష్ చేయండి.
ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఇది మీ చర్మాన్ని కాంతివంతం చేయడంలో, తాజా రూపాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా గోధుమ పిండి ఒక అద్భుతమైన సహజ ఎక్స్‌ఫోలియేటర్, ఇది ముఖం నుండి చనిపోయిన చర్మ కణాలు , అవాంఛిత రోమాలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మీ చర్మాన్ని శుభ్రంగా , మృదువుగా కూడా ఉంచుతుంది.
పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మపు మచ్చలను తగ్గించడమే కాకుండా చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా ముఖాన్ని కూడా తాజాగా కనిపించేలా చేస్తుంది.
పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. అంతే కాకుండా ముఖ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. చర్మాన్ని లోతుగా తేమగా చేస్తుంది. ఇది సహజమైన తేమను నిర్వహిస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ,మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.
Also Read: ఉల్లిరసంలో ఈ 2 కలిపి వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది !
నిమ్మరసం విటమిన్ సి కి గొప్ప మూలం. ఇది మొటిమలు, పిగ్మెంటేషన్ , మచ్చలను తగ్గిస్తుంది . అంతే కాకుండా మీ చర్మానికి ప్రకాశవంతమైన, స్పష్టమైన రూపాన్ని ఇస్తుంది.
రోజ్ వాటర్ చర్మపు చికాకును తగ్గిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా, సహజంగా ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడుతుంది.