Today Gold Rate: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు సోమవారం నాడు భారిగా తగ్గిన సంగతి తెలిసిందే.. అయితే తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో పాటు.. అమెరికా-చైనా దేశాల మధ్య ప్రతీకార సుంకాల విధింపు వాయిదా.. పడటంతో పసిడి ధరల్లో మార్పులు వచ్చాయని చెబుతున్నారు విశ్లేషకులు. తాజాగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,650 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95,620 వద్ద కొనసాగుతోంది. మొన్నటి వరకు అంతర్జాతీయ మార్కెట్‌లో 3400 డాలర్ల ఎగువన ట్రేడయిన ఔన్సు బంగారం ధర.. 3 వేల 218 డాలర్లకు దిగొచ్చింది.
ఇదిలా ఉంటే.. భారత స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందం, చల్లారుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయంగా అనుకూల పరిణామాలతో స్టాక్ మార్కెట్ సూచీలు నిన్న పరుగులు పెట్టాయి. రాకెట్‌లా దూసుకెళ్లాయి. ఈ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజే 16 లక్షల కోట్ల రూపాయలు పైగా పెరిగింది. గత నాలుగేళ్లలో మార్కెట్లు ఒక్కరోజులో ఇంత భారీగా లాభపడటం ఇదే తొలిసారి. దీంతో ఇన్వెస్టర్లు ఇవాళ ప్రాఫిట్ బుకింగ్‌కు దిగారు.
మార్కెట్లు గ్యాప్ డౌన్ అయ్యాయి. స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు మాత్రం గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. హెల్త్ కేర్ సెక్టార్ అత్యధికంగా 1.5శాతం లాభాలతో ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.
బంగారం ధరలు ఇలా
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,650 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95, 920 పలుకుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,650 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95, 920 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,650 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95, 920 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,800 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95,7700 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,650 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95, 920 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,650 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95, 920 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్ లో కిలో వెండి ధర రూ.1,09,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.97,900 వద్ద కొనసాగుతోంది.