Dream Psychology: కలల గురించి ఇప్పటికే చాలా థియరీలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఈ అంశంపై అనేక పరిశోధనలు జరుపుతున్నారు. అయితే కలలకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు మాత్రం దొరకలేదు. అటువంటి ప్రశ్నల్లోనే ఇద్దరు వ్యక్తులు ఒకే కల కనడం సాధ్యమా అనేది ఒకటి. దీని గురించి ఇప్పటికీ ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఇలాంటిది జరగడం సాధ్యమేనా అనేదానికి సమాధానం కోసం వెతుకుతున్నారు పరిశోధకులు.
ఇద్దరు వ్యక్తులు ఒకే కల కనడం అనే ఆలోచన చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది కదా..? ఈ కథలు ఎక్కడో పల్లెలో, లేదా సినిమాల్లో కనిపించేదానిలా అనిపిస్తుంటాయి, కానీ అవి నేటి రోజుల్లో కూడా వైరల్ అవుతున్నాయి. చాలా మంది ‘ఒకే కల కనడం’ అనే దాని గురించి మాట్లాడుకుంటారు. ఇది అనేక జానపద కథలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఈ అంశం మనల్ని ఆకర్షిస్తోంది. కానీ, శాస్త్రవేత్తలు ఈ విషయంపై ఎలా ఆలోచిస్తున్నారు అన్నది నిజంగా ఆసక్తికరమైన విషయం. అసలు ఇద్దరు వ్యక్తులకు ఒకే కల రావడం సాధ్యం అవుతుందా అనే ప్రశ్నకు సైంటిస్ట్‌లు ఏం చెప్తున్నారంటే..?
కలల గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు?
కలలు మనం నిద్రపోయినప్పుడు మెదడు అనేక భావోద్వేగాలు, జ్ఞాపకాలు, జీవిత అనుభవాలను ప్రాసెస్ చేస్తూ వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కలలు అనేవి చాలా పర్సనల్, మన మైండ్ సెట్, అనుభవాలు, మెదడు నిర్మాణం ఆధారంగా రకరకాల కలలు వస్తాయని స్టాన్‌ఫోర్డ్ న్యూరోసైంటిస్ట్ డాక్టర్లు చెబుతున్నారు. అందువల్ల ఒకే కల కనడం చాలా అరుదు అని అంటున్నారు.
ఒకే కలలు నిజంగా సాధ్యమా?
ఈ ప్రశ్న వాస్తవంగా చాలా ఆసక్తికరమైనది. కొంతమంది శాస్త్రవేత్తలు దీన్ని పరిశీలిస్తున్నారు. లోతైన భావోద్వేగ సంబంధం ఉన్న వ్యక్తుల మధ్య మెదడు తరంగాలు కొంతవరకు ఒకేరకంగా ఉండే అవకాశం ఉందని కేంబ్రిడ్జ్ సైకాలజిస్ట్ డాక్టర్లు వెల్లడిస్తున్నారు. అయితే, ఇదే నిజం అని చెప్పడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు. మనం ఒకే అనుభవాన్ని గడిపినప్పుడు, మన కలలు కొంచెం వేరు కావచ్చు, కానీ వీటి ప్యాటర్న్ సమానంగా ఉండవచ్చని అంటున్నారు.
మానసిక కారణాలు
ప్రపంచవ్యాప్తంగా, కొన్ని సమాజాలు ఒకేలాగా కలలు కనడం గురించి ఎన్నో కథలు చెబుతాయి. ఇది పూర్వీకుల సందేశాల వల్ల లేదా ఒకే అనుభవం వల్ల కావచ్చు. ఆధునిక సైకాలజీ ప్రకారం, మనం ఒకే అనుభవం గురించి మాట్లాడేటప్పుడు, మానసిక సంకోచం లేదా ధృవీకరణ బయాస్ వల్ల కూడా ఇద్దరు మనుషులకు ఒకేరకమైన కలలు వస్తాయి.
భవిష్యత్తులో ఏం జరుగుతుంది?
ఈ రోజు, EEG, fMRI లాంటి ఆధునిక టెక్నాలజీలు మనకు కలల ప్రక్రియను మరింత అర్థం చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నాయి. అనేక పరిశోధనలు, డ్రీమ్‌బ్యాంక్ లాంటి ప్రాజెక్టులు కలలపై మరింత సమాచారాన్ని సేకరించి వాటి ప్యాటర్న్స్‌ను అధ్యయనం చేస్తున్నాయి. మరింత స్పష్టమైన ఆధారాలు అందించినప్పుడు, భవిష్యత్తులో ఒకే కలల విషయంలో మనం మరింత తెలుసుకుంటామనే ఆశ ఉంది.