Trivikram Srinivas: ప్రముఖ టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పై తాజాగా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అసలు నువ్వు మనిషివేనా? అనే రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా, మాటల మాంత్రికుడిగా పేరు సొంతం చేసుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఒకప్పుడు డైలాగు రైటర్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత దర్శకుడిగా సత్తా చాటుతూ.. మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి రాకముందు న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎంఎస్సీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించిన ఈయన.. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. సాహిత్యం పై ఉన్న మక్కువతో సినిమా రంగంలోకి ప్రవేశించిన ఈయన హైదరాబాద్ కి వచ్చి పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) దగ్గర అసిస్టెంట్గా చేరాడు. మొదట్లో నటుడు సునీల్ (Sunil ) తో కలిసి ఒకే గదిలో ఉండేవారట.
రైటర్ నుంచి దర్శకుడిగా మారిన త్రివిక్రమ్..
1999లో ‘స్వయంవరం’ సినిమాతో మాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈయన.. ‘నువ్వే కావాలి’, ‘మన్మధుడు’, ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి చిత్రాలకు కథ , స్క్రీన్ ప్లే, రచయితగా పనిచేశారు. ఆ తర్వాత ‘అతడు’, ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలకు దర్శకుడిగా పనిచేసి సత్తా చాటారు. ఇక ఇప్పుడు వెంకటేష్ (Venkatesh) తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరొకవైపు అల్లు అర్జున్ (Allu Arjun) తో కూడా ఒక సినిమా లాక్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే .. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రతాపంపై ఎస్.రాధాకృష్ణ 2012లో నిర్మించిన చిత్రం జులాయి. అల్లు అర్జున్, ఇలియానా (Ileana ) ప్రధాన పాత్రల్లో సోనుసూద్, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన ఈ సినిమా.. 2012 ఆగస్టు 9న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
త్రివిక్రమ్ పై హిందూ సంఘాలు మండిపాటు..
ఇకపోతే ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయనకు భక్తి చాలా ఎక్కువ. తన పూజ గదిలో అన్ని మతాలకు సంబంధించిన ఫోటోలను పెట్టి పూజిస్తూ ఉంటాడు. అయితే ఈ విషయాన్ని సినిమా విడుదల సమయంలో ఎవరూ గుర్తించలేదు కానీ తాజాగా ఒక ఎక్స్ యూజర్ జులాయ్ సినిమా చూస్తూ.. ఈ విషయాన్ని ఐడెంటిఫై చేసి తన పోస్ట్ లో షేర్ చేశారు. ఇంకేముంది ఒక్కసారిగా హిందూ సంఘాలు దృష్టికి వెళ్లిన ఈ పోస్ట్ త్రివిక్రమ్ పై ఫైర్ అయ్యేలా చేసింది. “హిందూ దేవుళ్ళ మధ్య మిగతా మతాలకు చెందిన దేవుళ్ల ఫోటోలు కూడా పెట్టి, ఆ సన్నివేశం తీయాలనే ఆలోచన ఎలా వచ్చింది.. అసలు నువ్వు మనిషివేనా” అంటూ త్రివిక్రమ్ పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఆ పోస్ట్ విషయానికి వస్తే.. పూజ గదిలో అన్ని మతాలకు చెందిన దేవుళ్ల ముందు రాజేంద్రప్రసాద్ పూజిస్తూ ఉండే ఫోటోని వెనుక నుంచి తీసినట్టు అక్కడ షేర్ చేశారు. అంతేకాదు ఈ ఫోటో షేర్ చేస్తూ.. “జులాయి మూవీ చూస్తుంటే కనిపించింది.. సరిగ్గా చూడండి.. అలా ఎలా ఆలోచించావు త్రివిక్రమ్” అంటూ అల్లు అర్జున్ ని ట్యాగ్ చేశారు సదరు నెటిజన్. ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Julayi movie chusthunte kanipinchindhi 😂
Sarriga chudandi ., Ayina ala ela alochinchav Trivikram uu#Alluarjun pic.twitter.com/1T7Fbnv18c— Maniram 🚁 (@Maniram07) May 12, 2025