BigTV English

Today Gold Rate: తులం బంగారం 50 వేలు? ఎప్ప‌టినుంచంటే..

Today Gold Rate: తులం బంగారం 50 వేలు? ఎప్ప‌టినుంచంటే..

Today Gold Rate: కస్టమర్లను అయోమయానికి గురి చేస్తున్నాయి బంగారం ధరలు. మంగళవారం రాత్రి నుంచి ఇప్పటికే వెయ్యి రూపాయలు తగ్గింది పసిడి ధర. ఏప్రిల్ 21వ తేదీన చరిత్రలోనే తొలిసారిగా లక్ష మార్క్ ను టచ్ చేసిన బంగారం ధర.. ఆ మరుసటి రోజే మళ్ళీ 3వేలు పెరిగి లక్షా 3వేలకు చేరిన 24 క్యారెట్ల తులం బంగారం ధర చేరింది. గత కొన్ని రోజులుగా మళ్ళీ తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర 96 వేల 060 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర 88 వేల 050 రూపాయలుగా ఉంది.


ఈ మధ్య కాలంలో బంగారం ధరలు పెరిగినా.. తగ్గినా.. వెయ్యి రూపాయలపైనే మార్పు కనిపిస్తోంది. ఒక్కోసారి ఏకంగా 2వేల 500 రూపాయలకు పైగా ధరలు పెరగడమో.. తగ్గడమో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనాలా? వద్దా అనే కన్ఫ్యూజన్‌లో ఉన్నారు గోల్డ్ ప్రియులు. అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా బంగారం రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్లకు పైగా లాభాల్లో ఉన్నాయి. డిఫెన్స్ స్టాక్ట్స్ ఇవాళ మార్కెట్లను భారీగా ప్రభావితం చేస్తున్నాయి. డిఫెన్స్ స్టాక్స్ భారీగా ర్యాలీ అవుతున్నాయి. ప్రస్తుతం నాలుగున్నర శాతానికి పైగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి డిఫెన్స్ స్టాక్స్. నిఫ్టీ కేవలం 0.5 శాతం లాభాల్లోనే ఉంది. డిఫెన్స్ స్టాక్స్ మాత్రం.. నాలుగున్నర శాతం లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. గడిచిన 5 రోజుల్లో ఏకంగా 13 శాతం లాభపడ్డాయి. ఇవాళ డిఫెన్స్ స్టాక్ ఇండెక్స్ 300 పాయింట్లు, గడిచిన ఐదు రోజుల్లో 1000 పాయింట్లు ఎగబాకింది.


దాదాపు అన్ని డిఫెన్స్ స్టాక్స్ కూడా లాభాల్లోనే ఉన్నాయి. GRSE 16 శాతం, కొచ్చిషిప్స్ 13 శాతం, మిధానీ 10 శాతం, DCX INDIA 8 శాతం లాభాల్లో ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన BEL, HAL కూడా రెండున్నర శాతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండియా పాక్ ఉద్రిక్తత పరిస్థితులే డిఫెన్స్ స్టాక్స్‌ను ఓ రకంగా పరుగులు పెట్టించాయి.

పాక్ దాడులను మన డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. మనకు పెద్దగా నష్టం లేకుండానే దాయాది డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను ధ్వంసం చేశాయి మన బలగాలు. అమెరికా ఇచ్చిన F 16, చైనా టెక్నాలజీతో తయారైన ఫాతా 1 మిస్సైల్స్, టర్కీ డ్రోన్లు మన రక్షణ రంగం దగ్గర చిత్తు అయ్యాయి. దీంతో మన డిఫెన్స్ స్టాక్స్‌పై ఇన్వెస్టర్లకు నమ్మకం పెరిగి పెట్టుబడులను పెట్టారు. దీంతో ఒక్కసారిగా స్టాక్స్ లాభాల బాటలో పయనిస్తున్నాయి.

బంగారం ధరలు ఇలా

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.88,050 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.96, 060 కి చేరుకుంది.

విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.88,050 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.96, 060 వద్ద కొనసాగుతోంది.

వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.88,050 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.96, 060 ఉంది.

రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.88,200 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.96,210 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.88,050 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.96,210 వద్ద కొనసాగుతోంది.

ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.88,050 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.96,210 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.

Also Read: పైసా ఖర్చు లేకుండా6 లక్షల ప్రమాద భీమా. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన స్కీం

వెండి ధరలు ఇలా..

ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్ లో కిలో వెండి ధర రూ.1,09,000 కి చేరుకుంది.

ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.97,900 వద్ద కొనసాగుతోంది.

 

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×