Hyderabad Crime News: ఆ యువతిని ప్రేమించాడు అతను.. ప్రేమ పెళ్లికి అమ్మాయి ఇంట్లోవాళ్లు ససేమిరా అన్నాడు. చివరకు ఆ యువతిని మరిచిపోలేక మద్యానికి బానిసైపోయాడు. హైదరాబాద్ నగరానికి వచ్చేశాడు. ఇటీవల ప్రియురాలిని చూడడంతో ఒక్కసారిగా ఆ యువకుడి ప్రాణం వచ్చినట్లైంది. చివరకు ఆమె భర్త హెచ్చరించాడు. పట్టరాని కోపంతో ప్రియురాలి భర్తను పొడిచి పొడిచి చంపేసి కసి తీర్చుకున్నాడు. చివరకు జైలుకి వెళ్లాడు. ఈ ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలో చోటు చేసుకుంది.
తూర్పు గోదావరి జిల్లా అడవిపూడికి చెందిన 27 ఏళ్ల పవన్‌కుమార్ దాదాపు ఎనిమిదేళ్ల కిందట తన ఊరికి చెందిన సంధ్య అనే యువతిని ప్రేమించాడు. ఆ ప్రేమను వివాహంగా మలచుకోవాలని భావించాడు. ప్రేమ విషయాన్ని యువతి పేరెంట్స్‌కి చెప్పారు. అందుకు వాళ్లు ససేమరా అన్నారు.
చివరకు వెంకటరమణ అనే వ్యక్తికి సంధ్యను ఇచ్చి పెళ్లి చేశారు. ప్రస్తుతం సంధ్య తన భర్తతో కలిసి హైదరాబాద్ లోని కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో ఉంటోంది. ప్రియుడు పవన్‌కుమార్ విషయానికి వద్దాం. ప్రేమించిన యువతి దక్కక మద్యానికి బానిసయ్యాడు. కొడుకుని కళ్ల ముందు చూసి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. చివరకు ఊరి వదిలి వచ్చేశాడు.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిసరాల్లో ఉంటున్నాడు. ఇదే క్రమంలో సంధ్యను చూశాడు మాజీ ప్రియుడు పవన్ కుమార్. వారిని ఫాలో అవుతూ ఇంటిని కనుగొన్నాడు. ఓ రోజు ఇంటికి వచ్చాడు. సంధ్య భర్త.. పవన్‌కు గట్టగా మందలించాడు.. ఆపై వార్నింగ్ కూడా ఇచ్చాడు.
ALSO READ: 25 కోట్లకు కుచ్చు టోపి.. హైదరాబాదీ లగ్జరీ కార్ డీలర్ అరెస్ట్!
ప్రేమించిన అమ్మాయి తన కళ్లముందు భర్తతో సంతోషంగా ఉండటం చూశాడు. తనను కలిసేందుకు భర్త అడ్డుపడుతుండటంతో ఎలాగైనా సంధ్య భర్త వెంకటరమణ అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈనెల 11న వెంకటరమణ తన ఇంటిలోపక్కనేవున్న పార్క్‌లో పవన్ తన నలుగురు స్నేహితులతో కలిసి మద్యం తాగి అల్లరి చేశాడు.
అదే సమయంలో పవన్ -వెంకటరమణ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఇదే అదునుగా భావించిన పవన్, తనతో తెచ్చుకున్న కత్తితో వెంకటరమణ దాడి చేశాడు. తీవ్రగాయాలు పాలైన రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు సహకరించిన నలుగుర్ని అదుపులోకి తీసుకున్నాడు.
గురువారం ప్రధాన నిందితుడు పవన్ కుమార్‌ను అరెస్టు చేశారు పోలీసులు. న్యాయస్థానం నిందితుడికి రిమాండ్ విధించారు. పవన్ నుండి సెల్‌ఫోన్, కత్తి స్వాధీనం చేసుకున్నట్లు కూకట్‌పల్లి పోలీసులు వెల్లడించారు.