Today Gold Rate: కార్తీక మాసం ఎఫెక్ట్ దిగివచ్చిన బంగారం ధరలు.. ఈ ఏడాది దసరా, దీపావళి వేళ చుక్కలు చూపించిన పసిడి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. వరుస సెషన్స్‌తో బంగారం ధరలు నేల చూపు చూస్తున్నాయి. ఈ క్రమంలో గత మూడు, నాలుగు రోజులుగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తుంది. ఇది పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు ఆల్ టైమ్ హైకి చేరుకున్న గోల్డ్ రేటు మళ్లీ ఇప్పుడు ఆకర్షిస్తోంది. నవంబర్ మొదటి వారంలోనే బంగారం రూ.300 తగ్గటం గమనార్హం. ఇన్ని రోజులు పైపైకీ పోతూ ఆకాశాన్ని అంటిన బంగారం ధర ఇప్పుడు తగ్గడంతో పసిడి ప్రియులు ఆనంద పడుతున్నారు. ఇక ఈరోజు (నవంబర్-6) బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం రూ. 73,650 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80, 350 వద్ద స్థిరంగా ఉంది.
గోల్డ్ రేట్స్..
హైదరాబాద్, తెలంగాణ లో బంగార ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం రూ. 73,650 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80, 350 వద్ద స్థిరంగా ఉంది.
అలాగే విజయవాడ, వైజాగ్, గుంటూరులో కూడా 22 క్యారెట్ల తులం బంగారం రూ. 73,650 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80, 350 వద్ద స్థిరంగా ఉంది.
ఢిల్లీలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే.. 22 క్యారెట్ల తులం బంగారం రూ. 73,800 ఉంది. దీంతో పాటు 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,500 వద్ద స్థిరంగా ఉంది.
Also Read: గోల్డ్ కొనేవారికి ఊరట.. స్థిరంగా బంగారం ధరలు
ముంబైలో గోల్ట్ రేట్లు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం రూ. 73,650 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80, 350 ఉంది.
చెన్నైలో గోల్డ్ ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం రూ. 73,650 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80, 350 ఉంది.
వెండి ధరలు
చెన్నైలో, హైదరాబాద్, కేరళలో కిలో వెండి ధరలు చూస్తే.. రూ.1,05,000 వద్ద కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగుళూరులో కిలో వెండి రూ.96,000 వద్ద స్థిరంగా ఉంది.