Ananya Nagalla: తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ళ (Ananya Nagalla) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలంగాణ ముద్దుబిడ్డగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ‘మల్లేశం ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ వకీల్ సాబ్ ‘ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ‘శాకుంతలం’, ‘మాస్ట్రో’ , ‘యశోద’ వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా కూడా ప్రేక్షకులను అలరిస్తోంది.
వేణు స్వామిని కలిసిన అనన్య..
ఇక ఇటీవల ‘పొట్టేల్’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది అనన్య. అక్టోబర్ 25న విడుదలైన ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలకు సంబంధించిన కథతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే పొట్టేల్ సినిమా కంటే ముందే ‘ తంత్ర’అనే ఒక హారర్ సినిమాలో నటించింది అనన్య. క్షుద్ర పూజలు నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అటు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో అనన్య ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి (Venuswamy) ని కలవడంతో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రకరకాల కామెంట్లు వినిపించాయి. ఇక దీంతో అనన్య.. వేణు స్వామిని కలవడానికి గల కారణాలు తెలిపింది.
అందుకే వేణు స్వామిని కలిశాను..
అనన్య మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఆ రెండూ కలిసి ఉంటేనే సక్సెస్ అవుతాము. మరోవైపు ఇప్పటివరకు నేను ఎవరి దగ్గర జాతకం చెప్పించుకోలేదు .అసలు నాకు ఇలాంటి అవకాశం, ఆలోచన రాలేదు చిన్నప్పటినుంచి నేను జాతకాలు పట్టించుకునే దానిని కాదు. తంత్ర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేను వేణు స్వామి దగ్గరకు వెళ్లానే తప్ప నా జాతకం చూపించుకుందామనో లేక నా సినిమా సక్సెస్ అయ్యేలా ఏదైనా చేయమని అడగడానికో వెళ్లలేదు అంటూ తెలిపింది అనన్య ..ఇక వేణు స్వామి కూడా తనని పూజల కోసం పిలవలేదని స్పష్టంగా తెలిపారు ఏది ఏమైనా వేణుస్వామిని కలవడంపై రకరకాల రూమర్లు వైరల్ అయ్యాయి .ఇక ఎట్టకేలకు ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చింది.
వేణు స్వామి తో ప్రత్యేక పూజలు..
వేణుస్వామి విషయానికి వస్తే ప్రముఖ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఎక్కువగా సెలబ్రిటీల జాతకాలను బయటపెడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా గతంలో డింపుల్ హయతి , రష్మిక , ఇనయా సుల్తానా , అషురెడ్డి, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనన్య కూడా అందుకోసమే కలిసిందంటూ వార్తలు రాగా.. ఆమె ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి అయితే అనన్య చేసిన కామెంట్లు ట్రోలర్కి గట్టి షాక్ ఇచ్చాయని చెప్పవచ్చు.